Moviesఎన్టీఆర్ కి కొత్త తలనొప్పులు స్టార్ట్.. కొరటాల లాస్ట్ మినిట్ లో...

ఎన్టీఆర్ కి కొత్త తలనొప్పులు స్టార్ట్.. కొరటాల లాస్ట్ మినిట్ లో ఇలా చేశాడు ఏంటి..?

జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో .. ఒకవైపు పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తెరకెక్కిస్తూ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాల్లో నటిస్తూనే ..మరొకవైపు తనదైన స్టైల్ లో ఫ్యామిలీతోనూ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు . ఈ మధ్యకాలంలో పొలిటికల్ పరంగా ఎన్టీఆర్ పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురైందో మనం చూసాం. రీసెంట్గా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . ఎంతలా అంటే నందమూరి ఫ్యాన్స్ ని బాగా డీప్ గా హర్ట్ చేస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర . మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతూ ఉండడం విశేషం . నిజానికి ఈ సినిమాని అల్లు అర్జున్తో తెరకెక్కించాలి అనుకున్నాడు కొరటాల శివ . కానీ కొన్ని కారణాల చేత ఫైనల్లీ ఆ ప్రాజెక్టులో భాగమయ్యాడు తారక్ . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . కాగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారు అన్న ప్రచారం ఎక్కువగా జరిగింది. ఫైనల్లీ అదే విషయాన్ని కన్ఫామ్ చేశాడు కొరటాల శివ. దేవర రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు . అయితే బ్యాక్ టు బ్యాక్ వెంట వెంటనే ఇలాంటి సినిమాలు రిలీజ్ చేస్తేనే ఇలాంటి సీక్వెల్స్ మూవీస్ హిట్ అవుతాయి .

ఒక సినిమా తెరకెక్కించి కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని మరొక సినిమాని మరికొన్ని సంవత్సరాల తర్వాత తెరలెక్కిస్తే ఆ సినిమాలు కచ్చితంగా ఆడవు.. అయితే దేవర2ను బ్యాక్ టు బ్యాక్ తెరకెక్కించాలి అనుకున్నారట . కానీ కొన్ని అనివార్య కారణాల చేత కొరటాల ఆ నిర్ణయాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారట . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం దేవర2 ఆలస్యం కాబోతుందట . ఈలోపు వార్ 2 అదేవిధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను ఫినిష్ చేయబోతున్నాడట జూనియర్ ఎన్టీఆర్ . దీంతో నందమూరి ఫ్యాన్స్ డీప్ గా హర్ట్ అవుతున్నారు. ఇది నిజంగా జూనియర్ ఎన్టీఆర్కు కొత్త తలనొప్పి క్రియేట్ చేసే విషయం అని భావిస్తున్నారు ఫాన్స్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news