Moviesపవన్ ప్రమాణ స్వీకారోత్సవంలో చరణ్ చేసిన పనికి మండిపడుతున్న ఫ్యాన్స్ ..అసలు...

పవన్ ప్రమాణ స్వీకారోత్సవంలో చరణ్ చేసిన పనికి మండిపడుతున్న ఫ్యాన్స్ ..అసలు బుద్ధి బయటపడిందిగా..!

సోషల్ మీడియాలో ప్రెసెంట్ రాంచరణ్ పై హ్యూజ్ ట్రోలింగ్ జరుగుతుంది . దానికి ప్రధాన కారణం తన బాబాయ్ పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకార ఉత్సవంలో రామ్ చరణ్ బిహేవ్ చేసిన పద్ధతే. ఎప్పుడు చాలా సైలెంట్ గా ఉండే రామ్ చరణ్ .. అభిమానులు సెల్ఫీ అడిగితే కాదు.. కూడదు అని అనడు . చాలా సందర్భాలలో మనం అది చూసాం . ఆయన దగ్గరుండి అభిమానులకు సెల్ఫీ తీస్తాడు . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ ఆ విషయంలో తండ్రిని మించిపోతాడు అంటూ కూడా మెగా ఫాన్స్ ఎన్నోసార్లు పొగిడేసారు .

అయితే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన రామ్ చరణ్ అక్కడ ఓ వ్యక్తి సెల్ఫీ తీసుకోవడానికి దగ్గరికి రాగా సెక్యూరిటీతో నెట్టి వేయిస్తాడు. అంతేకాదు దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . అంటే రామ్ చరణ్ లుక్స్ చూసి సెల్ఫీ ఇస్తాడా..? అతగాడు బాగోలేదు.. మిడిల్ క్లాస్ పర్సన్ అని తెలిసి రామ్ చరణ్ సెల్ఫీ ఇవ్వకుండా సెక్యూరిటీ వాళ్ళ చేత నెట్టించేసాడా ..? అంటూ ప్రచారం జరుగుతుంది.

అయితే హై సెక్యూరిటీ మధ్య ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పక్షంలోని రామ్ చరణ్ అలా చేశాడు అంటున్నారు. ఏమో ఎందుకోసం రామ్ చరణ్ అలా చేశాడో కానీ ఫర్ ద ఫస్ట్ టైం సోషల్ మీడియాలో రామ్ చరణ్ పై హ్యూజ్ నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది . అయితే కొందరు కావాలని బన్నీ ఫ్యాన్స్ ఇలా రాంచరణ్ టార్గెట్ చేశారు అంటూ మరొక వర్గం ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఇతగాడి పేరు గబ్బు లేపుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news