Moviesమరికొన్ని రోజుల్లో కల్కి మూవీ రిలీజ్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న...

మరికొన్ని రోజుల్లో కల్కి మూవీ రిలీజ్.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నాగ్ అశ్వీన్ సెన్సేషనల్ (వీడియో)..!

నాగ్ అశ్వీన్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఈ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ఎలా అంటే ఎక్కడ చూసినా సరే ఇప్పుడు నాగ్ అశ్వీన్ నాగ్ అశ్వీన్ అంటూ కలవరించ్చేస్తున్నారు . దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ప్రభాస్ . పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా కల్కి . కేవలం మరి కొద్ది రోజులే మరి కొద్ది రోజుల్లోనే సినిమా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది .

జూన్ 27వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడుతున్నారు మూవీ టీం . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా కోసం దాదాపు 670 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారట. అయితే సినిమా కోసం వందల కోట్లు ఖర్చు చేస్తున్న నాగ్ అశ్వీన్.. ఒక బుల్లి కారులో తిరుగుతూ ఉండడం ఇప్పుడు అభిమానులకి ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది.

నాగ్ అశ్వీన్ అంటే ఓ స్టార్.. పాన్ ఇండియా స్టార్.. ఈ రేంజ్ లో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి నాగ్ అశ్వీన్ చిన్న కారులో తిరగడమేంటి..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . అయితే ఆయన గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని లైట్ గా తీసుకుంటున్నారు . నాగ్ అశ్వీన్ కి కోట్ల ఆస్తి ఉన్న చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఇష్టపడతారు అని .. ఆ కారణంగానే నాగ్ అశ్వీన్ ఇంత ఎత్తుకు ఎదిగాడు అని చెప్పుకొస్తున్నారు . మొత్తానికి నాగ్ అశ్వీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news