కల్కి..కల్కి..కల్కి.. ఇప్పుడు ఎక్కడ చూసిన సరే ఇదే పేరు వినిపిస్తుంది. జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ధియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ వద్ద అరాచకం సృష్టిస్తుంది . కల్కి 2898ఏడి ఇప్పుడు రిలీజ్ కు ముందే భారీ బిజినెస్ చేస్తూ షాక్ ఇస్తుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో కల్కి ఊపు చూస్తుంటే ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్కు మించి వసూలు చేసేలా ఉంది అంటున్నారు జనాలు..ఎక్స్పర్ట్స్.
ఇంకా రిలీజ్ కు ఐదు రోజులు ఉంది . అప్పుడే ఫ్రీ బుకింగ్స్ లో కల్కి రికార్డ్ క్రియేట్ చేసింది. నార్త్ అమెరికాలో అప్పుడే ఫ్రీ బుకింగ్ ఓపెన్ చేశారు . రెండు మిలియన్ల డాలర్లు రాబట్టింది . అంతేకాదు తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి ..రెండు రాష్ట్రాలలో కలిపి 180 కోట్లు దాకా బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది . పలు అగ్రిమెంట్స్ డీల్స్ కూడా క్లోజ్ చేసేసారు కల్కి మూవీ మేకర్స్. డిస్ట్రబ్యూటర్స్ కూడా పెట్టిన డబ్బుకి నాలుగైదు రెట్లు వెనక్కి తెచ్చుకుంటామన్న ధీమాతోనే ఉన్నారు . తెలంగాణ రైట్స్ ఏకంగా 70 కోట్లకు వెళ్లాయి అంటూ ప్రచారం జరుగుతుంది.
అంతేకాదు అశ్వినీ దట్ ఈ సినిమా కోసం 600 కోట్లు ఖర్చు చేశారు. అయితే సినీ ఎక్స్ పర్ట్స్ ఈ సినిమా 1000 కోత్లకు పైగానే కలెక్ట్ చేస్తుంది అంటూ అంచనా వేశ్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన సెకండ్ టరిలర్ సినిమా పై హ్యూజ్ బజ్ నెలకొల్పేలా చేసింది. ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. ప్రభాస్ ఖాతాలో బాహుబలి కి మించిన హిట్ పడేలానే ఉంది..!!