MoviesNBK109 స్పెషల్ గ్లింప్స్ లో మీరు ఇది గమనించారా..? బాలయ్య...

NBK109 స్పెషల్ గ్లింప్స్ లో మీరు ఇది గమనించారా..? బాలయ్య అభిమానులను బాగా హర్ట్ చేసిందిగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య నిన్న తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు . సోషల్ మీడియా వేదికగా పలువురు స్టార్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ శ్రేయోభిలాషులు అందరూ విష్ చేశారు . ఇదే క్రమంలో ఆయనకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చాయి . ఆయన నెక్స్ట్ నటించబోయే సినిమాలకు సంబంధించిన అనౌన్స్మెంట్లు కూడా వచ్చిన విషయం మనకు తెలిసిందే .

కాగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న బాలయ్య ఆ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశాడు . స్పెషల్ గ్లింప్స్ చాలా చాలా ఆకట్టుకుంది . మరి ముఖ్యంగా బాలయ్య లుక్స్ కెవ్వు కేక అనే చెప్పాలి . బాబి మరోసారి తనదైన స్టైల్ లో హిట్ అందుకోబోతున్నాడు అని చిన్న గ్లింప్స్ ద్వారానే అర్థమైపోతుంది . అయితే ఈ గ్లింప్స్ లో బాలయ్య నోటి నుంచి ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా మనం వినలేదు. అసలు బాలయ్య అంటేనే డైలాగ్ డెలివరీ పాపులారిటీ చెందిన వ్యక్తి ..

మరి అలాంటి వ్యక్తి నుండి ఒక్క డైలాగ్ కూడా వినిపించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది అంటున్నారు జనాలు. అంతేకాదు బాలయ్య ఈ సినిమాలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు అని తెలిసిపోతుంది. బహుశా బాలయ్యని ఈ సినిమాలో ఏదైనా జబ్బు పాత్రలో కనిపించే వ్యక్తిగా చూపించబోతున్నారా ..? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి . ఒకవేళ అదే జరిగితే మాత్రం బాబి పెద్ద తప్పు చేసినట్లే ..బాలయ్య లాంటి స్టార్ డైరెక్టర్ ఏదైనా జబ్బు వ్యక్తిగా చూపించి.. నోటి నుంచి డైలాగ్స్ రాకుండా చేస్తే అది సినిమాకి భారీ బొక్క తప్పదు..? అనే విధంగా మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది
.చూద్దాం మరి సినిమా రిలీజ్ అయ్యే లోపు బాబి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తాడో లేదో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news