సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ – రష్మిక, అనుష్క – ప్రభాస్, నాగచైతన్య – సమంతల పేర్లు తర్వాత మారుమ్రోగిపోయేలా వినిపించే పేర్లు పవిత్ర లోకేష్ – నరేష్ . అఫ్ కోర్స్ కాకపోతే ఘాటైన ప్రేమాయణం కొనసాగించిన కప్పుల్.. ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరికి పుడుతుందో ఎవరు చెప్పలేరు అని .. మరోసారి ప్రూవ్ చేసింది ఈ ఓల్డ్ జంట . అప్పట్లో వీళ్ళ పేర్లు ఎలా మారుమ్రోగిపోయాయో మనకి తెలిసిందే.
సోషల్ మీడియా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా పవిత్ర లోకేష్ – నరేష్ పేరుని జపించే రేంజ్ కి వీళ్ళు తమ ప్రేమాయణాన్ని తీసుకొచ్చారు . కాగా ఎవరు ఏమనుకున్న సరే మా లైఫ్ మా ఇష్టం అంటూ హ్యాపీగా లైఫ్ని గడిపేస్తున్న పవిత్ర లోకేష్ – నరేష్ పలు సినిమాలతో బిజీగా కూడా ఉన్నారు. రీసెంట్గా నరేష్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ తన పర్సనల్ తన ప్రొఫెషనల్ లైఫ్ కి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి .
నరేష్ మాట్లాడుతూ..” మా అమ్మ విజయ్ నిర్మల పుట్టినరోజు ..పవిత్ర లోకేష్ పుట్టినరోజు ఒకటే ..ఇద్దరి బర్త్డ డే ఫిబ్రవరి 20నే.. అలా ప్రకృతి నాకు సిగ్నల్ పంపించింది” అంటూ పవిత్ర లోకేష్ తో ప్రేమాయణం గురించి బయట పెట్టాడు. ” పవిత్ర కూడా మా అమ్మలాగే చాలా చాలా మంచిది.. స్ట్రాంగ్ ఉమెన్ ..కానీ మా అమ్మ నాతో ఎప్పుడూ నీకు అన్నీ ఇచ్చాను కానీ మంచి తోడు ఇవ్వలేకపోయాను అంటూ బాధపడేది ..పవిత్ర ఆస్థానాన్ని ఫుల్ ఫిల్ చేసింది .. మా అమ్మ బెడ్ మీద పడుకొని ఉంది .. ఆమెకు అది చివరి దశ .. నేను చెప్పాను అప్పుడు అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు నా జీవితంలోకి మంచి వ్యక్తి వచ్చింది “అని నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి..!!