MoviesNTR 101వ జయంతి: ఘాట్ వద్ద తారక్ చేసిన పనికి షాక్...

NTR 101వ జయంతి: ఘాట్ వద్ద తారక్ చేసిన పనికి షాక్ అవుతున్న అభిమానులు..!!

మనకు తెలిసిందే ..జూనియర్ ఎన్టీఆర్ కి వాళ్ళ తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే ఎంత ఇష్టమో ..ఆ విషయం సమయం వచ్చినప్పుడు బయట పడుతుంది. తెలుగు భాషకు తెలుగు వారికి తెలుగు సినిమాకి ఆయన ఒక ప్రత్యేక గుర్తింపు అని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. మహా నాయకుడు అని చెప్పాలి . ఒకపక్క సినిమాలను మరొక పక్క రాజకీయాల్లో సమాంతరంగా ఏలేసి ప్రజాపాలన అంటే ఇది అని చూపించిన మహానటుడు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలా అందరి గుండెల్లో నిలిచిపోయారు.

ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు అంటే ఆయన చేసిన మంచి పనులే కారణం అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . గత సంవత్సరం ఎన్టీఆర్ శతజయంతిని తెలుగు రాష్ట్రాలలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు . నేడు మే 28 ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాటు వద్దకు వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు .

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఫ్యామిలీ తెలుగుదేశం నాయకులు ఇప్పటికే పలువురు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులర్పించారు . అయితే ఈ మూమెంట్లో తారక్ చాలా ఎమోషనల్ అవుతూ కనిపించడం అభిమానులని ఇంకా ఇంకా ఎమోషనల్ చేసేసింది. ప్రతిసారి తాత ఘాట్ దగ్గరికి రాగానే చెప్పులు లేకుండా వినయంగా నమస్కరించి ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాడు . ఈసారి కూడా అదే చేశాడు ఎన్టీఆర్ అక్కడికి రావడంతో ఫోటోల కోసం భారీ సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు . దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news