టైం.. ఎప్పుడు ..ఎవరికి ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేము. ఈ విషయంలో ఎవరైనా సరే కాలం ముందు తలవంచాల్సిందే . ప్రజెంట్ అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అది కూడా సౌత్ ఇండియాలోనే క్రేజియస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార విషయంలో అలా జరగడం ఇప్పుడు అభిమానులకు సైతం షాకింగ్ గా ఉంది.
మనకు తెలిసిందే ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా సరే నయనతార పేరు చెప్తే వచ్చే ఆ అరుపులు మాత్రం వేరేగా ఉంటాయి. అయితే పెళ్లి తర్వాత నయనతార తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేసింది . మరీ ముఖ్యంగా అమ్మడు రెమ్యూనరేషన్ విషయంలో హద్దులు మీరిపోయింది . తన స్థాయికి మించి డిమాండ్ చేయడం మొదలుపెట్టింది . దీంతో కొంతమంది అంత ఇచ్చుకోలేక సింపుల్గా ఆమెకు నో చెప్పేసి .. వేరే బ్యూటిఫుల్ హీరోయిన్స్ ని చూస్ చేసుకోవడం అలవాటు చేసుకున్నారు.
దీంతో నయనతార కాల్ షీట్స్ ఖాతాలు అన్ని అలాగే ఉండిపోయాయట . తిక్క కుదిరిన అమ్మడు ఇంటికి వచ్చి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్స్ కు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి మీరు అడిగిన రెమ్యూనరేషన్ కి ఓకే చేస్తాను అంటూ ఓ మెట్టు దిగే మాట్లాడుతుందట . కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . నయనతార లాంటి హీరోయిన్ కి ఇలాంటి పరిస్థితి దాపురించడం నిజంగా టూ బ్యాడ్ అంటున్నారు జనాలు..!