Movies"కుబేర"లో నాగ్ లుక్ ఆ హిట్ సిరీస్ నుండి కాపీ కొట్టారా..?...

“కుబేర”లో నాగ్ లుక్ ఆ హిట్ సిరీస్ నుండి కాపీ కొట్టారా..? అడ్డంగా దొరికిపోయారుగా(వీడియో)..!

ఈ మధ్యకాలంలో సీనియర్ హీరోలు రూటు మార్చేస్తున్నారు . తానే హీరోగా నటించాలి అనే ఉద్దేశం లేకుండా పలు బడా హీరో సినిమాలలో కూడా మంచి మంచి పాత్రలో కనిపిస్తున్నారు. అక్కినేని నాగార్జున – ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమాలో కీలకపాత్రలో కనిపిస్తున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడో వచ్చేసింది . అప్పటినుంచి అక్కినేని అభిమానులు ఈ సినిమాలో నాగార్జున ఎలా కనిపించబోతున్నాడు ..? డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏ లుక్స్ లో నాగార్జునను అభిమానులకి పరిచయం చేయబోతున్నాడు అంటూ ఓ రేంజ్ లో చర్చించుకున్నారు .

తాజాగా నాగార్జున ఫస్ట్ లుక్ టీజర్ ని ఈ చిత్రం బృందం రిలీజ్ చేసింది . బ్లూ షార్ట్ ధరించి కళ్ళజోడు పెట్టుకొని చాలా కూల్ లుక్ లో కనిపిస్తాడు నాగార్జున. చూస్తుంటే నాగార్జున రిచ్ గా అసలైన కుబేరుడు గా మనకు తెలుస్తుంది . అయితే టీజర్ ని బట్టి శేఖర్ కమ్ముల సినిమాలను అంచనా వేయలేము. అందుకే ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంటుందో అంటూ చర్చించుకుంటున్నారు జనాలు .

వర్షం పడుతూ ఉండగా గొడుగు పట్టుకుని నాగార్జున వస్తాడు .. అక్కడ డబ్బు కట్టలు ఉన్న భారీ కంటైనర్ దగ్గరికి వచ్చి ఉంటాడు . కంటైనర్ నుంచి తిరిగి వస్తుండగా 500 నోట్లు వర్షంలో తడిసిపోతాయి . దీనితో తన జోబులో నుంచి ఒక 500 నోట్లు తీసి ఆ కంటైనర్ లో కలిపేస్తాడు ..చూస్తూ ఉంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది . మరీ ముఖ్యంగా నాగార్జున లుక్స్ కెవ్వు కేకగా అనిపిస్తున్నాయి.

దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా మారబోతుంది అంటూ తెలుస్తుంది. అయితే ఈ లుక్స్ చూసిన జనాలు దూత వెబ్ సిరీస్ లో అక్కినేని నాగచైతన్య కి సంబంధించిన లుక్స్ లా ఉన్నాయి అంటూ.. ఈ సినిమా కూడా దూతలాగా కాపీ కొట్టాడేమో అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరి కొంతమంది అక్కినేని కుటుంబం పై ఏడవడం మానండిరా బాబు అంటూ దారుణతి దారుణంగా కౌంటర్ లు వేస్తున్నారు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news