వితికా.. ఈ పేరుకి కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేనటువంటి పేరు . ఇండస్ట్రీలో హీరోయిన్.. టాప్ డ్యూటీ అని చెప్పలేం.. హీరోయిన్ అని మాత్రమే చెప్పగలం . కానీ వరుణ్ సందేశను పెళ్లి చేసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వితికరు పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోయింది. ఆమె మంచితనం ఆమె కట్టు ఆమె బొట్టు ఆమె అల్లరితనం అభిమానులను బాగా మెస్మరైజ్ చేశాయి .
బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది వితికా . తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది . ఈ ఇంటర్వ్యూలో జనాలకు తెలియని పర్సనల్ విషయాలను కూడా ఓపెన్ గా మాట్లాడేసింది . తాను ఎందుకు పిల్లలకి దూరంగా ఉన్నాను అనే విషయాన్ని ఓపెన్ గా చెప్పేసిన వితిక తనను తన అమ్మ ముందే కమిట్మెంట్ అడిగారు అన్న విషయాన్ని కూడా బయటపెట్టింది .
“పదహారేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను . ఆ టైంలోనే ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు నా ఆడిషన్ తీసుకొని మా అమ్మని రూమ్ లోకి పంపియమన్నారు.. కమిట్మెంట్ ఇవ్వాలి అంటూ అడిగారు ..మా అమ్మకి అర్థం కాలేదు ..నా దగ్గరకు వచ్చింది నన్ను లోపలికి తీసుకెళ్లి అడిగింది ఏంటి..? కమిట్మెంట్ అంటూ నన్ను అడిగింది ..అప్పుడే నాకు అర్థమైంది అలాంటివన్నీ నేను చేయలేను అంటూ వచ్చేశాను “అంటూ చెప్పుకొచ్చింది .
అయితే తెలుగు ఇండస్ట్రీలో కన్నా ముందు తెలుగు బ్యూటీ అయిన వితిక కన్నడ ఇండస్ట్రీలో పరిచయమైంది . ఆ టైంలో ఒక బడా స్టార్ డైరెక్టర్ ఇలా అమ్మాయిలను అందరిని క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇబ్బంది పెట్టాడు. ఆయన సింపుల్ డైరెక్టర్ ఏం కాదు ..అవార్డు విన్నింగ్ డైరెక్టర్ ..ప్రజెంట్ ఇండస్ట్రీలో సినిమాలు చేయడం లేదు . కానీ అప్పట్లో ఓ రేంజ్ లో అల్లాడించేశారు .ఆయనే వెతికని కూడా కమిట్మెంట్ అడిగి ఉంటారు అన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!