నాగచైతన్య .. ఏ ముహూర్తాన సమంతను పెళ్లి చేసుకున్నాడో తెలియదు కానీ అప్పటినుంచి ఆయన కెరియర్ రేంజ్ లో టర్న్ అవుతది అనుకున్నాడు . టర్న్ అయింది టర్న్ అయినట్లే టర్న్ అయ్యి యూటర్న్ కూడా తీసుకుంది . అది ఏ విధంగానో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఆయన పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. అప్పటివరకు మంచి హీరో అనిపించుకున్న నాగచైతన్య హ్యూజ్ ట్రోలింగ్ ఫేస్ చేయడమే కాకుండా భారీ నిందలు కూడా మోసాడు.
ఆయనకు పిల్లలు పుట్టే స్టామినా లేదు అని ఆ కారణంగానే సమంత విడాకులు తీసుకుంది అంటూ కొందరు ప్రచారం కూడా చేశారు. ఇదేంటి ఒకటా రెండు చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి . అయితే నాగచైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి మెయిన్ రీజన్ నాగచైతన్య మొండితనమే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . తాజాగా నాగచైతన్య మోసం చేశాను అంటూ చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసాయి. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య మాట్లాడిన మాటలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు .
ఎప్పుడైనా రిలేషన్షిప్ లో మీరు మోసం చేశారా..? అని హోస్ట్ అడగ్గా దానికి అవును.. లేదా కాదు అనే సమాధానం ఇవ్వాలి . చైతు ఓపెన్ గా డేర్ గా అవును అని నిజం ఒప్పుకున్నాడు. ” ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని అనుభవించాలి ..అప్పుడే ఎదుగుతారు” అని కూడా కౌంటర్ వేశాడు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అయితే ఆ వీడియో గతంలో నాగచైతన్య – అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన శైలజా రెడ్డి అల్లుడు ప్రమోషన్ లో భాగంగా చేసిన కామెంట్స్ . దీన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ కావాలని నాగచైతన్య పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కొందరు పని పాట లేని బ్యాచ్ .
సమంతని ఆయన మోసం చేసినట్లు ఇన్నాళ్లకు నిజం ఒప్పుకున్నాడు అని చర్చించుకుంటున్నారు . అయితే శైలజా రెడ్డి అల్లుడు సినిమా టైం వరకు నాగచైతన్య సమంత విడాకులు తీసుకోలేదు మరి ఆ టైంలో నాగచైతన్య చేసిన కామెంట్స్ ఎలా సమంతకు వర్తిస్తాయి..? అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ . మరి కొందరు మాత్రం అప్పటికే వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి అని ..అదే విషయాన్ని పరోక్షంగా కన్ఫర్మ్ చేశారని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి దారిన పోయే దరిద్రం మరోసారి నాగచైతన్య మెడకు చుట్టుకున్నట్లయింది..!