సినిమా ఇండస్ట్రీలో రూమర్ లు సర్వ సాధారణం. ఇండస్ట్రీలోకి వచ్చి అవకాశాలు రాని ముద్దుగుమ్మ ఉంటుందేమో.. హిట్ కొట్టలేని హీరోస్ కూడా ఉంటారేమో ..కానీ రూమర్ రాని హీరో – హీరోయిన్ – క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాత్రం ఎవ్వరూ లేరు . ఈ మధ్యకాలంలో డైరెక్టర్ లు..ప్రొడ్యూసర్లపై కూడా రూమర్స్ వచ్చేస్తున్నాయి . సోషల్ మీడియా అంత బాగా డెవలప్ అయిపోయింది . అయితే ఇక్కడ ఓ హీరోయిన్ ఆ సోషల్ మీడియా డెవలప్మెంట్ ను బాగా వాడేస్తుంది.
ఎంతలా అంటే తనపై తానే సొంతంగా రూమర్స్ క్రియేట్ చేయించుకునే విధంగా మారిపోయింది. దానికి కారణం ఇండస్ట్రీలో ఆమెకు అవకాశాలు రాకపోవడమే అంటూ తెలుస్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ బడాబడా హీరోల సినిమాలో నటించిన మెప్పించింది. ఓ రేంజ్ లో అల్లాడించేసింది . సీన్ కట్ చేస్తే ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారుతూ వచ్చాయి .
దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గింది . మేకర్స్ డైరెక్టర్స్ ఆమెను పట్టించుకోవడం మానేశారు . రెమ్యూనరేషన్ తగ్గించుకున్నా సరే ఆమె ముఖం చూసే దిక్కే లేకుండా పోయింది . దీంతో ఏం చేయాలో దిక్కు తోచిన పరిస్థితుల్లో ఆ హీరోయిన్ సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటుందట .అందుకే తనపై తానే రూమర్స్ క్రియేట్ చేయించుకుంటుందట . పలానా హీరోలు సినిమా అవకాశం.. పలానా డైరెక్టర్ కారణంగా సినిమా అవకాశాలు వస్తున్నాయి ..పలన డైరెక్టర్ జాన్ జిగిడి దోస్త్ అనే రేంజ్ లో ఆమె రూమర్స్ క్రియేట్ చేయించుకొని అవకాశాలు దక్కించుకోవడానికి ట్రై చేస్తుందట. దీంతో నెటిజన్స్ మండిపడుతున్నారు . ఒక హీరోయిన్ ఇంతకు దిగజారి పోతుందా ..?అవకాశాల కోసం ఇలా చేయాలా అంటూ మండిపడుతున్నారు. ప్రజెంట్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది..!!