సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కామన్ పీపుల్స్ కూడా సినిమా ఇండస్ట్రీని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా తమ ఫేవరెట్ హీరోల సినిమాల విషయంలో మరింత కఠినంగా ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. తమ ఫేవరెట్ హీరో ఏం చేస్తున్నాడు..? ఎలాంటి మూవీస్ కి ఓకే చేస్తున్నారు..? అసలు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ని చూస్ చేసుకుంటున్నారు .. అనే విషయాలపై ఫ్యాన్స్ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు .
తాజాగా సోషల్ మీడియాలో ఒక పెద్ద అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు జనాలు. పాన్ ఇండియా డైరెక్టర్లు అంటూ చెప్పుకొస్తున్న రాజమౌళి – సుకుమార్ – ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ లు ఎందుకు చిన్న హీరోలతో సినిమా చేయరు .. బడాబడా స్టార్స్ తోనే సినిమాలు తెరకేకిస్తారు .. ?? డైరెక్టర్స్ అంటే డైరెక్షన్ పరంగా హిట్ కొట్టాలి ..ఆల్రెడీ హిట్ అయిన హీరోతో సినిమా తీసి ..హిట్టు కొట్టడం పెద్ద డైరెక్షనా..?
ఫ్లాప్ అయిన హీరోతో హిట్ కొట్టడమే అసలు సిసలైన హిట్.. ఆ మజా వేరేగా ఉంటుంది అంటున్నారు . మరి ఎందుకు రాజమౌళి కానీ ప్రశాంత్ నీల్ కానీ ..సుకుమార్ గానీ ..ఆ నిర్ణయం తీసుకోవడం లేదు .. అలా చేస్తేనే కదా ..? వాళ్ళ అసలైన డైరెక్షన్ బయటపడుతుంది..?? ఆల్రెడీ తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న హీరోలను.. వాళ్ల డైరెక్షన్లో చూపిస్తే ఏ ఫ్యాన్ అయినా సరే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసే విధంగా ముందుకు వెళ్తారు .. అది పెద్ద సక్సెస్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!