సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ పేరుకు ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనే సంగతి మనం సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. మరి ముఖ్యంగా ఉదయ్ కిరణ్ తనదైన స్టైల్ లో సినిమాలు చేసి అమ్మాయిల చేత వావ్ అని అనిపించుకున్నాడు . అప్పట్లో బుక్స్ పై అమ్మాయిలు ఉదయ్ కిరణ్ పేరుని ఏ రేంజ్ లో రాసుకొని ఆనందపడేవారో.. ఆ జనరేషన్ అమ్మాయిలకు బాగా గుర్తుండే ఉంటుంది.
ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారిన ఉదయ్ కిరణ్ అతి చిన్న వయసులోనే సూసైడ్ చేసుకొని మరణించారు . కాగా ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ఏదో ఒక వార్త ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది అంటే కారణం ఆయన పైన అభిమానులకు ఉన్న ప్రేమ అని చెప్పక తప్పదు. ఉదయ్ కిరణ్ నిర్మాతలని రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడట . ఇక అప్పట్లో ఉదయ్ కిరణ్ ..బడా బడా బ్యానర్స్ లో నటించే సినిమాలకు సైతం తక్కువ తీసుకునే వాడట .
ఒక పెద్ద డైరెక్టర్ నిర్మాత ఒక స్టోరీని బడా హీరోకి చెప్తే హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేవారు. కానీ అదే కధను ఉదయ్ కిరణ్ దగ్గర చెప్తే మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను ..కధ ఇంపార్టెంట్ అంటూ చెప్పేవారు . అప్పట్లో ఉదయ్ కిరణ్ ఇలా మాట్లాడటం పై పలువురు స్టార్ హీరోలు కూడా గుర్రుగా ఉండేవారు. ఇంత మంచితనం పనికిరాదు అంటూ అవహేళన చేసేవారు . బహుశా ఆ మంచితనమే ఆయన కొంప ముంచేసింది..!!