సాధారణంగా హీరోయిన్స్ కి ఒక లెక్క ఉంటుంది.. ఏ హీరోతో చేస్తే మన కెరియర్ టాప్ పొజిషన్లో ఉంటుంది.. ఏ హీరోతో చేస్తే మనకి హిట్లు పడతాయి .. ఏ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటే మన పేరు మారుమ్రోగిపోతుంది అని ఒక అంచనా .. ప్రతి ఒక్క హీరోయిన్ కి ఉంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అలాంటి ఐడియాలు ఉన్నా లేకపోయినా .. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొంతకాలానికి ఆ తెలివి అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది . అది అంతే సినిమా ఇండస్ట్రీ అంటేనే అంత.
అయితే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న ఓ బ్యూటీ నాగచైతన్యతో సినిమాను రిజెక్ట్ చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఒకే రీజన్ తో నాగార్జున కొడుకు అని తెలిసినా కూడా స్టార్ట్ డైరెక్టర్ లకు నిర్ మొహమాటంగా నాగచైతన్యతో సినిమా చేయలేను అంటూ చెప్పేసింది. దానికి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకున్న రష్మిక మందన్నా.. నాగచైతన్యతో సినిమాలో నటించ లేను అంటూ చేతులెత్తేసిందట . వీళ్ళ కాంబోలో మొదటిగా రావాల్సిన సినిమా మజిలీ .
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్గా ఆమెని అనుకున్నారు. కానీ కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వని కారణంగా ఆమె రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత వీళ్ళ కాంబోలో రావాల్సిన సినిమా కస్టడి. కృతిశెట్టి ఆ అవకాశం దక్కించుకుంది . ముందుగా ఈ పాత్ర కోసం రష్మికను అప్రోచ్ అయ్యారట. అయితే కాల్ షీట్స్ ఖాళీ లేవు అంటూ చేతులెత్తేసిందట . ఫైనల్లీ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సాయి పల్లవి స్థానంలో మొదటి రష్మిక ని అనుకున్నారట .
పుష్పవన్ పుష్ప2లో నేచురల్ లుక్స్ లో కనిపిస్తున్నాను .. ఈ సినిమాలోను అలాంటి లుక్స్ లో కనిపిస్తే నా కెరియర్ డమాల్ అంటుంది అంటూ హ్యాండ్ ఇచ్చిందట . సాధారణంగా ఏ హీరోయిన్ కూడా పెద్ద హీరోతో సినిమా అంటే అన్నిసార్లు రిజెక్ట్ చేయదు .. మరి రష్మిక కావాలనే చేసిందో ఆమె టైం బాగోలేక కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వలేదో.. ఈ విషయం తెలుసుకున్న అక్కినేని ఫాన్స్ మాత్రం మండిపడుతున్నారు..!!