Moviesసీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్..అభిమానులకి ఊహించని స్వీట్...

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్..అభిమానులకి ఊహించని స్వీట్ షాక్..!!

ఈ మధ్యకాలంలో టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా గుట్టూ చప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీజన్ ఏంటో తెలియదు చాలామంది స్టార్ సెలబ్రెటీస్ ఇలా సైలెంట్ గా పెళ్లి చేసుకుని ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన ఫోటోలను వీడియోలను రిలీజ్ చేస్తున్నారు . అయితే కొంతమంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లిల మ్యాటర్ సోషల్ మీడియాలో లీక్ అయిపోతూ ఉంటే మరి కొంతమంది పెళ్లిళ్ల మ్యాటర్స్ మాత్రం వాళ్లు అనౌన్స్ చేసే వరకు బయటకు రాని పరిస్థితి మనం చూస్తున్నాం ..

రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అపూర్వ శ్రీనివాసన్ పెళ్లి చేసేసుకుంది. సైలెంట్గా గుట్టుచప్పుడు కాకుండా కేవలం తన కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకుంది . ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచిన టెంపర్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అపూర్వ శ్రీనివాసన్..

ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది . ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది . అయితే సడన్ గా ఇండస్ట్రీ నుంచి దూరమై పైలట్గా జాబ్ చేస్తుంది . ఆమె పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . చాలా ట్రెడిషనల్ గా సాంప్రదాయ బద్దంగా ఉన్న అపూర్వ శ్రీనివాసన్ ఫొటోస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ఆమెకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు . అయితే ఇంత సీక్రెట్గా పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ కొంతమంది జనాలు ఆశ్చర్యపోతున్నారు..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news