Moviesతాప్సి పెళ్లిలో జరిగిన ఈ రెండు వింతలు గమనించారా .. ఇప్పటివరకు...

తాప్సి పెళ్లిలో జరిగిన ఈ రెండు వింతలు గమనించారా .. ఇప్పటివరకు ఏ హీరోయిన్ లైఫ్ లో జరగని రేర్ మూమెంట్స్..!

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాలు ఎక్కువగా నడుపుతున్నారు స్టార్ హీరోలు హీరోయిన్లు . సీక్రెట్ గానే ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉండడం చాలా సీక్రెట్ గా డేటింగ్ చేసుకుంటూ ఉండడం మనం చూసాం. అయితే ఇక్కడ ఓ హీరోయిన్ మాత్రం చెప్పకుండా పెళ్లి కూడా చేసేసుకునింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ తాప్సి పన్ను.

ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తనదైన స్టైల్ లో బాలీవుడ్ ను ఏలేస్తూ వచ్చింది. అయితే ఎప్పుడు తన పెళ్లి గురించి అడిగిన కాదు ..కూడదు.. లేదు అని తప్పించుకునే ఈ బ్యూటీ కొన్ని రోజుల ముందే బ్యాడ్మింటన్ ప్లేయర్ మదియస్ బోను తో డేటింగ్ చేస్తున్నాను అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పుకు వచ్చింది . అయితే చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు సమక్షంలో వీరిద్దరి వివాహం రాజస్థాన్లోని ఉదయపూర్ లో మార్చి 23వ తేదీన జరిగినట్లు తెలుస్తుంది .

రీసెంట్గా పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అయితే అందరూ చాలా వరకు పెళ్లిళ్లకు లెహంగానే వేసుకుంటూ ఉంటారు .కానీ తాప్సి మాత్రం తమ సాంప్రదాయ బద్ధంగా వస్తున్న ట్రెడిషన్ ఫాలో అయింది . చుడిదార్ లో చాలా ట్రెడిషనల్ గా చక్కగా మెరిసింది . అంతేకాదు అన్ని విషయాలలో మోడరన్ ఆదర్శంగా తీసుకునే తాప్సి పెళ్లి విషయంలో మాత్రం చాలా సాంప్రదాయబద్ధంగా సింపుల్గా.. క్లీన్ గా తన పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకుంది .

ఎక్కడ మీడియా ప్రమేయం లేకుండా కేవలం తన కుటుంబ సభ్యుల సమక్షంలో తాను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది . అంతేకాదు పెళ్లి తర్వాత కూడా చాలా పద్ధతులను సాంప్రదాయ బద్ధంగానే ముందుకు తీసుకెళ్ళింది . అయితే తాప్సి ఎందుకు తన పెళ్లిని సీక్రెట్ గా దాచింది.. అంటే మాత్రం సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయ్. వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగిస్తారు అన్న భయంతోనే తాప్సి ఆ పెళ్లి విషయాన్ని చెప్పకుండా దాచి పెట్టేసిందట . తాప్సి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news