Moviesజాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన సమంత.. మరో ఏం మాయ చేసావే...

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన సమంత.. మరో ఏం మాయ చేసావే లాంటి హిట్ పక్కా.. రాసి పెట్టుకోండి..!

సమంత .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్కి గురైన పేరు . రీసెంట్గా అమ్మడుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ అవుతున్నాయి . మయోసైటిస్ వ్యాధి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టు ఫైనలైజ్ చేసింది అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అన్న ప్రచారం గత కొంతకాలంగా జరుగుతుంది.

పుష్ప2 సినిమా కంప్లీట్ అయిపోగానే అట్లీ బన్నీ కాంబోలో తెరకెక్కే సినిమా సెట్స్ పైకి రాబోతుంది అంటూ తాజాగా క్లారిటీ వచ్చింది . అయితే ఈ క్రేజీ ప్రాజెక్టులో మొదటి హీరోయిన్ గా సెలెక్ట్ అయింది సమంత అంటూ ఓ హాట్ హాట్ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. గతంలో సమంత అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే .

అంతే కాదు పుష్ప2 లో ఐటెం సాంగ్ లో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ . ఇప్పుడు మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోబోతూ ఉండడంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . అంతేకాదు కొందరు ఏం మాయ చేసావే లాంటి హిట్ మళ్లీ తన ఖాతాలో పడబోతుంది అంటూ సమంత ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు . చూడాలి మరి దీనిపై అఫీషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news