సమంత ..సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ సినిమాలో మొదటి హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కెరియర్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఓ రేంజ్ లో దున్నేసిన సమంత ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురై ఇండస్ట్రీకి దూరమైంది . ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ దగ్గర కాబోతుంది . సినిమాలు కూడా నిర్మించాలి అంటూ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది .
ఇలాంటి క్రమంలోనే సమంత వద్దకు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయట . కానీ హీరోయిన్ సమంత కొత్త కండిషన్లతో డైరెక్టర్లకు చుక్కలు చూపిస్తుందట. ఒకప్పుడు హీరోయిన్ సమంత టాప్ హీరోయిన్ కానీ ఇప్పుడు ఆమెను మించిపోయే రేంజ్ లో కూడా చాలామంది ఫిగర్లు ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నారు . అయితే సమంత ఇప్పటికీ తాను నటించే సినిమాలలో ఆమె ఫస్ట్ హీరోయిన్ గా ఉండాలి అంటూ కండిషన్ పెడుతుందట.
కొందరు డైరెక్టర్స్ దీనికి ఓకే చెప్పొచ్చు మరి కొంతమంది మాత్రం ఒకే చెప్పకపోవచ్చు . అయితే సమంత పెట్టిన కండిషన్స్ ఎవరైతే ఓకే చేస్తున్నారో అలాంటి డైరెక్టర్ సినిమాలకి ఆమె సైన్ చేస్తుందట .ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. సమంత తీసుకున్న నిర్ణయం పై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి . కొందరు మంచి నిర్ణయం అంటూ ఉంటే మరికొందరు తెలివితేటలతో ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటున్నారు . మరికొందరు ఇంకా అమ్మడు టాప్ హీరోయిన్ అన్న ఫీలింగ్ లోనే ఉంది అంటూ భ్రమ పడుతుంది అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!