Moviesఒక్క మాటతో 100 కోట్లు పోగొట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న...

ఒక్క మాటతో 100 కోట్లు పోగొట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్ ..!

జూనియర్ ఎన్టీఆర్ మల్టీ టాలెంటెడ్ హీరో ..ఉన్నది ఉన్నట్లు మాట్లాడే హీరో.. అభిమానులను గౌరవించే హీరో ..ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో ట్యాగ్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది . ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా కష్టపడుతున్నాడు . బరువు కూడా తగ్గాడు.. అన్ని సక్రంగా జరుగుంటే ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ అయి ఉండాల్సింది .

కానీ కొన్ని అడ్డంకులు కారణంగా పెద్ద మనుషులు తీసుకున్న నిర్ణయాలు కారణంగా ఈ సినిమా దసరాకు పోస్ట్ పోన్ అయింది. దీంతో సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి . నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయాలి అనీ ఆలోచించకుండా ఉండి ఉంటే కచ్చితంగా ఈ సినిమా 100 కోట్లు క్రాస్ చేసి ఉండేది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. కొరటాల శివ చెప్పిన మాట విని జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా పోస్ట్ పోన్ విషయంలో ఓకే చేసి 100 కోట్లు నష్టపోయేలా చేసుకున్నాడు అని అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు .

జూనియర్ ఎన్టీఆర్ ఏప్రిల్ 5వ తేదీ దేవర సినిమాను రిలీజ్ చేసి ఉంటే కచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అయి ఉండేది. ఆ రేంజ్ సినిమాలు ఆ డేట్ న రిలీజ్ కాకపోవడం ఆ సినిమాకు కాంపిటీషన్ ఇచ్చే సినిమాలు లేకపోవడం ఆ డేట్ కి ఉన్న ప్లస్ పాయింట్ . అంతేకాదు సమ్మర్ హాలిడేస్ కూడా బాగా కలిసి వచ్చేవి . ఉగాది – రంజాన్ హాలిడేస్ బ్యాక్ టు బ్యాక్ రావడంతో సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చి చేరేది.. ఒక్క నిర్ణయంతో 100 కోట్లు బొక్క పెట్టుకున్నాడు ఎన్టీఆర్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news