ఫరీయా అబ్దుల్లా.. ఇండస్ట్రీలో కత్తిలాంటి ఫిగర్లు ఎంతమంది ఉన్నా సరే ఈ బ్యూటీ పేరు చెప్తే కుర్రాళ్ళు తెగ నవ్వేసుకుంటారు.. ఆటోమేటిక్‌గా నవ్వొచ్చేస్తుంది ..అంతే అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . జాతి రత్నాలు అనే సినిమా ద్వారా మరో జాతి రత్నంగా పాపులారిటీ సంపాదించుకున్న ఫరియా అబ్దుల్లా.. హైట్ విషయంలో ప్రభాస్ అక్కా అనిపించుకుంటుంది . అంత తోపైన యాక్టర్స్ . అంతేకాదు ఫరీయా అబ్దుల్లా చాలా నాటి ఫెలో.. చాలా చాలా సరదాగా ఉంటుంది .
ఎలాంటి విషయాలనైనా సరే చిల్ అవుట్ అవుతూ లైట్‌గా తీసుకుంటుంది. జాతి రత్నాలు సినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించింది మెప్పించింది ..కానీ పెద్ద హీరోయిన్గా మారలేకపోయింది . అల్లరి నరేష్ ఫరీయా అబ్దుల్లా జంటగా తాజాగా నటించిన చిత్రం “ఆ ఒక్కటి అడక్కు” . సోమవారం ఏప్రిల్ 22న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఫరియా కాలికి ఉన్న టాటూతో కనిపించింది .
ఎడమ కాలిపై ఎర్రటి వేర్లు గీతలు ఉన్నాయి. దానిపై నీలి ఆకారంలో వృత్తం ఉంది . ఇది చూసిన ఓ రిపోర్టర్ స్ట్రైట్ గా అడిగేసాడు . మీ టాటూ సీక్రెట్ ఏంటి ఫరియా ..? అంటూ అడిగాడు ..ఆమె కూడా ఓపెన్ గా ఆన్సర్ చేసింది ..”వేర్లు బలంగా ఉంటేనే మొక్క దృఢంగా ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా.. అలాగే మనం ఎంతో ఒదిగి ఉంటేనే ఇంకా ఎక్కువ ఎత్తుకు ఎదుగుతాం.. అనేది నా ఒపీనియన్ .. మరీ ముఖ్యంగా సెలబ్రిటీ లైఫ్ లో ఒదిగి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ..ఆ విషయం నేను పదే పదే గుర్తుపెట్టుకోవాలని ఇలా పచ్చబొట్టు పొడిపించుకున్నాను” అంటూ స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఆన్సర్ చేసింది . అంతేకాదు ఆమె ఈ టాటూ వేసుకోవడానికి కారణం ఓ స్టార్ హీరో అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . అంతేకాదు ఫరీయా అబ్దుల్లా ఇంత డేర్ గా ఆన్సర్ ఇవ్వడం పట్ల జనాలు శభాష్ అంటూ పొగిడేస్తున్నారు.