Moviesదేవర క్లైమాక్స్ అలా ఉండబోతుందా ..? ఫస్ట్ టైం కెరియర్లో అలా...

దేవర క్లైమాక్స్ అలా ఉండబోతుందా ..? ఫస్ట్ టైం కెరియర్లో అలా చేయబోతున్న కొరటాల..!

ఒక డైరెక్టర్ కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ క్రియేటివిటీ . అది ఉంటే చాలు సినిమా హిట్ అయిపోతుంది. ఒకే కాన్సెప్ట్ ని 10 రకాలుగా తీసే క్రియేటివి ఉన్న డైరెక్టర్ మన ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు . అయితే ఒకే కాన్సెప్ట్ 10 రకాలుగా చూపిస్తే జనాలు లైక్ చేస్తారా..? అని మీరు అనుకోవచ్చు ..ఆ కంటెంట్ లో కాస్తో కూస్తో క్రిస్పీనెస్ సస్పెన్స్ ఉంటే కచ్చితంగా జనాలు ఆదరిస్తారు . ఇప్పుడు మన ఇండస్ట్రీలో పలు డైరెక్టర్లు చేస్తున్న పని కూడా అదే .

రీసెంట్ గా కొరటాల శివ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న భారీ సినిమా దేవర . జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది . ఈ సినిమాలో డ్యూయల్ షెడ్ లో కనిపించబోతున్నాడు తారక్.

అంతేనా ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతుంది . ఈ సినిమాలో జాన్వి కపూర్ కి తండ్రిగా శ్రీకాంత్ నటించబోతున్నాడు . పలువురు స్టార్ సెలబ్రిటీ స్ కీలక పాత్రలో మెప్పించబోతున్నారు . కాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమా క్లైమాక్స్ ని అద్దిరిపోయే రేంజ్ లో రాసుకున్నాడట కొరటాల శివ . పార్ట్ వన్ క్లైమాక్స్ కి పార్ట్ 2 బిగినింగ్ వచ్చేలా ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో ఏ డైరెక్టర్ చేయని సాహసం చేయబోతున్నాడట.

ఈ సినిమాలో వచ్చే ట్విస్ట్ పోకిరి – బాహుబలి కి మించిన రేంజ్ లో ఉండబోతుందట . అంతేకాదు ఈ సినిమా లో ఆ సీన్ షూట్ చేయడానికి కావాల్సిన సభ్యులను మాత్రమే పెట్టి షూట్ చేయించాలి అని డిసైడ్ అయ్యారట. దీని సంబంధించి ఒక్క మ్యాటర్ కూడా లీక్ కాకూడదు అంటూ పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడట కొరటాల శివ . చూద్దాం మరి కొరటాల శివ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news