Moviesఅంత ట్రోలింగ్ జరుగుతున్న విజయ్ దేవరకొండ సైలెంట్ గా ఉండడానికి కారణం...

అంత ట్రోలింగ్ జరుగుతున్న విజయ్ దేవరకొండ సైలెంట్ గా ఉండడానికి కారణం అదేనా..? రౌడీ హీరో రూటే సపరేట్..!

విజయ్ దేవరకొండ .. సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతున్న పేరు . రీసెంట్గా విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకుంది . పలువురు జనాలు అలాగే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఈ సినిమాపై నెగటివ్గా స్పందించారు. సినిమాకి అంత సీన్ లేదు అని విజయ్ దేవరకొండ రేంజ్కి తగిన సినిమా కాదు అంటూ చెప్పుకొచ్చారు .

సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. అయితే ఎప్పుడు తన గురించి ఏ ట్రోలింగ్ జరిగినా వెంటనే స్పందించే విజయ్ దేవరకొండ ఈసారి మాత్రం చాలా చాలా సైలెంట్ గా ఉండిపోయాడు . దానికి కారణం ఏంటో చర్చించుకుంటున్నాడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ ఏది మాట్లాడిన అది సోషల్ మీడియాలో పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు అని.. కావాలనే కొందరు పని కట్టుకొని ఆయనను ట్రోల్ చేస్తున్నారు అని తెలుసుకున్న విజయ్ దేవరకొండ అటువంటి వాటిపై స్పందించకూడదు అంటూ డిసైడ్ అయ్యారట.

ఆ కారణం చేతనే విజయ్ దేవరకొండ ఇంత ట్రోలింగ్ జరుగుతున్న సైలెంట్ గా ఉండిపోయారట. త్వరలోనే విజయ్ దేవరకొండ టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ తిన్నూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు . ఈ సినిమా ఎలాంటి విజయమందుకుంటుందా అని ఫ్యాన్స్ ఇప్పటినుంచే టెన్షన్ పడుతున్నారు. సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండకు సంబంధించిన వార్తలు బాగా బాగా వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news