సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రక రకాల వార్తల వైరల్ అవుతున్నాయి . ఏది నిజం ఏది అబద్దం అని చెప్పడం పెద్ద గగనంగా మారిపోయింది . ఈ వార్త అబద్దమేమో..? అని అనుకునే సమయంలోనే అది నిజం అంటూ స్టార్ హీరోలు కన్ఫామ్ చేసేస్తున్నారు . అయ్యో ఈ వార్త నిజమేనా అని అనుకునే లోపే తూచ్ ఆ న్యూస్ ఫేక్ అంటూ జనాలు కు కన్ఫామ్ చేస్తున్నారు స్టార్ సెలబ్రిటీస్ . రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే ఆ వార్త ఎంత వరకు నిజమనేది మాత్రం తెలియడం లేదు .
నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వార్త కావడంతో సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిన్ను చూడాలని సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 లో కూడా నటిస్తున్నారు .
అంతేనా పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . కాగా ఎన్టీఆర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” తాను ఒక హీరోయిన్ ని లైక్ చేశానని ..ఆ విషయం ఆమెకి తెలుసు అని ..కానీ ఆ విషయం ఆమెతో చెప్పలేకపోయాను అని.. చెప్పుకు వచ్చాడట”. 24 ఏళ్ల వయసులో అదంతా అట్రాక్షన్ అంటూ తనకు తానే సర్ధి చెప్పుకున్నారట . ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అని ..లైఫ్ అంటే ఏంటో తనకు తెలిసిందని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినట్లు వార్త వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది..!!