Moviesగ్లోబల్ అవార్డు తెచ్చి పెట్టిన RRR సినిమా కంటే ..ఉపాసనకు ఆ...

గ్లోబల్ అవార్డు తెచ్చి పెట్టిన RRR సినిమా కంటే ..ఉపాసనకు ఆ మూవీ అంటేనే ఇష్టమా..? రాజమౌళి పరువు తీసేసిందిగా..!!

రామ్ చరణ్ – ఎన్టీఆర్కు గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు వచ్చింది అంటే కారణం ఆర్ ఆర్ ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఎన్ని హిట్లున్న వాళ్లకు గ్లోబల్ ఇమేజ్ తెచ్చి పెట్టిన ఏకైక సినిమా మాత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రణం రౌధ్రం రుధిరం. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోట్లాదిమంది ఇండియన్స్ ఎదురుచూసిన ఆస్కార్ అవార్డును సైతం తీసుకొచ్చింది .

రీసెంట్గా సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు చరణ్ నటించిన అన్ని సినిమాలలోకి ఫేవరెట్ మూవీ ఏంటి అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చింది . ఆ మూవీ ఆరేంజ్. ఆ సినిమాలో చరణ్ పెర్ఫార్మెన్స్ టు నాటీగా ఉండడంతో పాటు లవర్ బాయ్ లుక్ లు అదరగొట్టేసాడు అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేశారు .

సినిమా ఫ్లాప్ అయినా సరే చరణ్ లుక్స్ కు పాటలకు మంచి క్రేజ్ ఏర్పడింది . ఆ తర్వాత మగధీర – రంగస్థలం సినిమాలు అంటే ఉపాసనకు చాలా చాలా ఇష్టమట. అయితే రామ్ చరణ్ కెరీర్నిమలుపు తిప్పిన ఆర్ఆర్ఆర్ సినిమా పేరు చెప్పకుండా మిగతా అన్ని సినిమాల పేర్లను ఆమె ప్రస్తావించడం రాజమౌళి అభిమానులకు బాధగ అనిపిస్తుంది. రాజమౌళిని అవమానించింది అని పరోక్షంగా ఉపాసన అంటూ ఆమెపై ఫైర్ అయిపోతున్నారు రాజమౌళి ఫ్యాన్స్..!
!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news