సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ అందరికీ కామన్ గా నచ్చిన హీరో విజయ్ దేవరకొండ . టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటి సంపాదించుకున్న ఈ హీరో గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . మరి ముఖ్యంగా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ సెలబ్రెటీ స్టేటస్ అందుకున్నాడు . రీసెంట్గా ఆయన నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . దిల్ రాజు నిర్మాణంలో పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ ఘనంగా థియేటర్స్ తో రిలీజ్ కాబోతుంది .
ఈ సినిమా తెలుగు – తమిళ భాషలలో రిలీజ్ చేస్తున్నారు . ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . తెలుగు – తమిళ భాషలలో రిలీజ్ చేసిన తర్వాత రెండు వారాలకు హిందీ – మలయాళం లో రిలీజ్ చేయబోతున్నారు . ఈ మూవీ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు విజయ్ దేవరకొండ . తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన తన పెళ్లిపై ఓపెన్ అప్ అయ్యాడు.
విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానులకు కల . దాని గురించి ఆయన ఓపెన్ గా చెప్పేయడం అభిమానులకి మంచి కిక్కిస్తుంది . “నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది.. పిల్లల్ని కనాలని ఉంది .. ఆగండి వెయిట్ .. కచ్చితంగా నేను మీకు గుడ్ న్యూస్ చెప్తాను.. కానీ కొంచెం టైం పడుతుంది ..కానీ నేను చేసుకునేది లవ్ మ్యారేజ్ ..ఆ అమ్మాయి నాతో పాటు మా తల్లి దండ్రులకు కూడా బాగా నచ్చాలి అంటూ చెప్పుకొచ్చాడు”. దీంతో పరోక్షకంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాతో పెళ్లిపై హింట్ ఇచ్చేశాడు అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ న్యూస్ ను ట్రెండ్ చేస్తున్నారు . ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి..!!