సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉండొచ్చు . స్టార్ హీరోలు – డైరెక్టర్లు- హీరోయిన్లు కూడా ఫ్రెండ్స్ గా ఉండొచ్చు . కానీ కొందరు మాత్రం చాలా చాలా డీప్ గా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తూ ఉంటారు . ఎంతలా అంటే తమ దగ్గరకు వచ్చిన సినిమాను తమకంటే తమ ఫేవరెట్ ఫ్రెండ్ అయినా హీరోకి బాగుంటుంది అని సజెస్ట్ చేసిన హీరోలు చాలామంది ఉన్నారు . వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!
పవన్ కళ్యాణ్: ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో.. ప్రెసెంట్ పాలిటిక్స్ పనుల్లో బిజీ బిజీగా ఉన్నాడు . పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు . అన్నీ కూడా ఫ్రెండ్షిప్ కోసమే వదులుకోవడం గమనార్హం . మరి ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అల్లు అర్జున్ : ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో.. ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకుని ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను ఓకే చేస్తున్న ఈ హీరో ఫ్రెండ్షిప్ కి చాలా వాల్యూ ఇస్తాడు .. ఫ్యామిలీ ఇంపార్టెంటా..? ఫ్రెండ్ షిప్ ఇంపార్టెంటా..? అంటే ముందుగా ఫ్రెండ్షిప్ కి ఓటు వేసే టైప్ . అంతే కాదు తారక్ అంటే మహా మహా ఇష్టం . గతంలో ఆయన వద్దకు వచ్చిన ఎన్నో సినిమాలు తారక్ కి బాగుంటాయి అంటూ స్పెషల్గా సజెస్ట్ చేసి మరి అల్లు అర్జున్ – తారక్ పేరును చూస్ చేశారు . తారక్ కూడా అల్లు అర్జున్ అంటే చాలా చాలా ఇష్టం ముద్దుగా బావ బావ అంటూ పిల్చుకుంటూ ఉంటారు.
రామ్ చరణ్: గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తన రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పూర్తిగా మార్చేసుకున్నాడు. రామ్ చరణ్ ప్రెసెంట్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. కాగా చరణ్ కి కూడా ఫ్రెండ్షిప్ అంటే చాలా చాలా ఇష్టం . మరీ ముఖ్యంగా ఆయన తన బెస్ట్ ఫ్రెండ్ కోసం చాలా చాలా త్యాగాలు చేశాడు అన్న విషయం గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపడింది.
నాని : నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని కూడా ఫ్రెండ్షిప్ కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు .బయటకు కనిపించడు కానీ నానికి కూడా ఫ్రెండ్స్ ఎక్కువే ..అంతే కాదు నాని ఫ్రెండ్స్ కోసం చాలా మంచి పనులే చేశాడు . ఇండస్ట్రీలో నానికి బెస్ట్ ఫ్రెండ్స్ చాలా తక్కువ అయినప్పటికీ ఆయనకు పర్సనల్గా బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రం చాలా ఎక్కువే..
ఎన్టీఆర్ : ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నమ్మకానికి నిజాయితీకి మరో మారుపేరు ఎన్టీఆర్ . ప్రెసెంట్ దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్ కి ఎంత విలువ ఇస్తాడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు . తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ – చరణ్ – బన్నీ – విశ్వక్సేన్ చాలామంది హీరోస్ కు జాన్ జిగిడి దోస్త్..!!