చాలామంది ఇండస్ట్రీలో హీరోయిన్స్ పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత ఎక్స్పోజ్ చేయకూడదు అని .. సినిమా ఇండస్ట్రీలో నటించకూడదు అని .. ఏదైనా ఒక్క చిన్న ఎక్స్పోజింగ్ ఫోటో రిలీజ్ అయినా సరే నానా విధాలుగా ట్రోల్ చేస్తూ ఉంటారు . అయితే ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది .. కొందరు హీరోయిన్స్ ఆ ట్రోలింగ్ ని చూసి చూడనట్టు వదిలేస్తే మరికొందరు మాత్రం ఓపెన్ గా బోల్డ్ గా స్పందిస్తూ ఉంటారు . రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ అలాంటి వ్యాఖ్యలే చేసింది .
మనకు తెలిసిందే టాలీవుడ్ – బాలీవుడ్-కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ .. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నాని ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత వరుస హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. రీసెంట్గా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని తన అందాలను ఆరబోస్తుంది . ఆ షోలో రకుల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ఆ ఫ్యాషన్ షో లో చిట్టి పొట్టి బట్టలతో అలరించింది.
అయితే ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత వస్త్రాధారణ మార్చాలని ఇంట్లో వాళ్ళు చెప్పలేదా ..? అని మీడియా ప్రశ్నించగా.. రకుల్ కోపంతో ఊగిపోయింది . “ఎవరు చెప్పారండి పెళ్లి తర్వాత డ్రెస్సింగ్ విషయంలో స్టిక్ట్ గా ఉండాలి అని .. ఎవరి ఇష్టం వాళ్ళది .. ఎవరి ఒపీనియన్ వాళ్ళది .. ఇదే విషయాన్ని మీరు స్టార్ హీరోలను అడగగలరా..?” అంటూ ఓ రేంజ్ లో ఊగిపోయింది .
రకుల్ మాట్లాడిన మాటలు నిజమే .. పెళ్లయితే అన్ని ఆపేసుకోవాలా..? అంటూ పలువురు అమ్మాయిలు కూడా రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలను ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత తన ఇష్ట ప్రకారమే నడుచుకుంటాను అంటూ చెప్పకనే చెప్పేసింది. పాపం జాకీ భగ్నానీ అంటూ కుర్రాళ్ళు వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!