Moviesదేవర విషయంలో సంచలన నిర్ణయం .. టైం చూసి కొట్టిన కొరటాల..!?

దేవర విషయంలో సంచలన నిర్ణయం .. టైం చూసి కొట్టిన కొరటాల..!?

ఈ సంవత్సరం సినీ లవర్స్ కు బిగ్ పండగనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా స్టార్స్ సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి . అది కూడా భారీ బడ్జెట్ సినిమాలు కావడం గమనార్హం . ప్రభాస్ – రామ్ చరణ్ – అల్లు అర్జున్ – తారక్ లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉండడంతో సినీ లవర్స్ పండగ చేసుకుంటున్నారు .

అయితే మా హీరో గొప్ప అంటే మా హీరో తోపు అంటూ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వార్ కూడా చేసుకుంటున్నారు . ఇలాంటి మూమెంట్లోనే సోషల్ మీడియాలో పలు సినిమాల రిలీజ్ డేట్స్ క్లంజిగా మారిపోయాయి . ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి సిచువేషన్ నెలకొన్నదో తెలిసిందే. ఎప్పుడు ఏ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది .

అయితే దేవర సినిమా ఆల్రెడీ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అక్టోబర్ 10కి వెళ్ళింది. అయితే ఇప్పుడు కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయిన కారణంగా మళ్లీ దసరా నుంచి క్రిస్మస్ కి పోస్ట్ పోన్ అవ్వమంటూ దేవరని బలవంతం చేస్తున్నారట కొందరు ఇండస్ట్రీ పెద్దలు . అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కొరటాల ఇప్పుడు మాత్రం కఠిన నిర్ణయం తీసుకున్నారట .

తాను అనుకున్న డేట్ కి ఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ అయిన పర్లేదు అదే డేట్ నా దేవర సినిమాను రిలీజ్ చేయాలని భీష్ముంచుకుని కూర్చున్నాడట. ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ – కొరటాల ముగ్గురు కూడా ఒకే నిర్ణయం తీసుకొని స్ట్రాంగ్ గా నిలబడ్డారు . దీంతో కొరటాల డెసిషన్కు ఇండస్ట్రీ పెద్దలు షాక్ అయిపోతున్నారు . ఇప్పుడు మిగతా పెద్ద సినిమాలని క్రిస్మస్ కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..???

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news