Movies"ప్రతి సినిమాకి కమిట్ అయ్యే ముందు అదే చేస్తా" ..సెన్సేషనల్ విషయాని...

“ప్రతి సినిమాకి కమిట్ అయ్యే ముందు అదే చేస్తా” ..సెన్సేషనల్ విషయాని బయటపెట్టిన రష్మిక మందన్నా..!

నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకున్న రష్మిక మందన్నా.. ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ పొజిషన్ అందుకుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకుంది ఈ బ్యూటీ . ఒకటి కాదు రెండు కాదు చేతిలో ఏకంగా ఆరు బడా ప్రాజెక్టులు పెట్టుకున్న ఈ బ్యూటీ కి సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

రష్మిక మందన్న ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళుతుంది . రీసెంట్గా పుష్ప2 సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకుంది. ఈ పాత్ర నాకు చాలా ప్రత్యేకమని ..చాలా బాధ్యతగా ఉంటుంది అని చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను కమిట్ అయ్యే ప్రతి సినిమాలోనూ ఏదైనా మెసేజ్ ఉండాలి అని ఆలోచిస్తుంది అని.. అలా లేని పక్షంలో ఖచ్చితంగా జనాలు తన పాత్రను చూసి నవ్వుకొని ఎంటర్టైన్ అయ్యే విధంగా ఉండాలి అని అనుకుంటుందట.

అందుకే ఆమె చూస్ చేసుకునే పాత్రలు అలా ఉంటాయట . ప్రతి సినిమా విషయంలోనూ ఆమె అదే నిర్ణయం తీసుకుంటుందట . సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై రష్మిక స్పందిస్తూ అలాంటివి పెద్దగా పట్టించుకోను అని ..కెరియర్ స్టార్టింగ్ లో భాద అనిపించింది అని ..మెల్లమెల్లగా మర్చిపోవడం స్టార్ట్ చేశాను అని చెప్పుకు వచ్చింది. ప్రజెంట్ రష్మిక మందన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news