ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ – అల్లు అర్జున్ – వరుణ్ తేజ్.. ప్రజెంట్ ఎలాంటి టాప్ పొజిషన్లో ఉన్నారో మనకు తెలిసిందే.. రాంచరణ్ – బన్నీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలకు ఓకే చేస్తూ గ్లోబల్ స్థాయిలో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు . త్వరలోనే వీళ్లు నటించిన సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. కాగా రీసెంట్గా పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ కూడా కెరియర్ లో మంచి మంచి సినిమాలో నటించడానికి బాగా తాపత్రయపడుతున్నారు.
అయితే ఇలాంటి క్రమంలోనే వీళ్ళకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ గా మారింది. రామ్ చరణ్ – బన్నీ – వరుణ్ తేజ్ ముగ్గురు కూడా ఒకే కండిషన్‌కు ఒప్పుకొని తమ లైఫ్ పార్ట్నర్స్ ను పెళ్లి చేసుకున్నారు అన్న విషయం ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ కి స్నేహ రెడ్డి ముందుగానే కండిషన్ పెట్టిందట . పెళ్లి తర్వాత కచ్చితంగా తన కాళ్లపై తను నిలబడే విధంగా బిజినెస్ – ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకుంటాను అని చెప్పిందట.
చాలామంది పెద్దింటి కోడలు పెళ్లి తర్వాత ఏ రంగంలోనూ ముందుకు వెళ్లడానికి ఒప్పుకోరు . కానీ బన్నీ మాత్రం స్నేహారెడ్డి కోసం ఆ కండిషన్ ని ఒప్పుకున్నాడు. అలాగే రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా పెళ్లికి ముందే ఈ కండిషన్ పెట్టిందట. పెళ్లి తర్వాత కూడా తాను ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉండడానికి ఇష్టపడతాను అని .. ఫస్ట్ డే చెప్పేసిందట . అందుకు రాంచరణ్ ఓకే అనడంతోనే ఉపాసన చరణ్ ను పెళ్లి చేసుకుంది . ఫైనల్లీ మెగా కోడలు లావణ్య త్రిపాఠి .. ఈమె కూడా పెళ్లి తర్వాత ఇండిపెండెంట్ ఉమెన్ గానే ఉండడానికి ఇష్టపడింది. వరుణ్ తేజ్ కూడా అందుకు ఓకే చెప్పాడు. ఆ కారణంగానే వరుణ్ – లావణ్య ల పెళ్లి కూడా జరిగింది . ముగ్గురు కూడా ఒకే కండిషన్ కి యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకున్నారు అన్న వార్త బాగా వైరల్ గా మారింది..!!