Moviesరాశిఖన్నాకు ఆ తెలుగు హీరో అంటే అంత కోపమా..? అందుకే అడిగినా...

రాశిఖన్నాకు ఆ తెలుగు హీరో అంటే అంత కోపమా..? అందుకే అడిగినా కూడా ఒక్క సినిమా కూడా చేయలేదా..?

సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు . కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం హిట్స్ కొట్టక పోయినా సరే అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు . అలాంటి వాళ్ళల్లో ఒకరే రాశి కన్నా . అమ్మడు హిట్స్ కొట్టింది చాలా తక్కువ . ఊహలు గుసగుసలాడే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చింది . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్లింది . రీసెంట్గా రాశి ఖన్నా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

కాగా రాశి ఖన్నా ఏ హీరోతోనైనా సినిమా చేయడానికి సిద్ధంగా ఉంటుంది . హిట్ పడ్డ హీరోనా ఫ్లాఫ్ పడ్డ హీరోనా అని చూడదు . చాలా మంది డైరెక్టర్స్ కూడా ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చారు . అయితే హీరోయిన్ రాశి కన్నా మాత్రం ఓ తెలుగు హీరోతో నటించడానికి అస్సలు ఒప్పుకోలేదట. మూడు సార్లు అవకాశాలు వచ్చిన రిజెక్ట్ చేసేసిందట .దానికి కారణం అతగాడు ఆమెపై చేసిన వల్గర్ కామెంట్స్ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది .

రాశి కన్నా బాడీ పై పిచ్చిగా కామెంట్ చేశాడట ఆ తెలుగు హీరో. మొదటి నుంచి చాలా సరదాగా ఉండే ఆ హీరో బడాబడా సినిమాల్లో కూడా నటించాడు. అయితే హీరోయిన్స్ బాడీస్ పై ఫన్నీగా స్పందించే ఆ హీరో రాశి ఖన్నా పై మాట్లాడిన మాటలు ఆమెకు నచ్చలేదట . అందుకే అతగాడితో స్క్రీన్ షేర్ చేసుకోకూడదు అంటూ డిసైడ్ అయ్యిందట . ఆ కారణంగానే ఆ తెలుగు హీరోతో అందరూ హీరోయిన్స్ నటించాలి అనుకుంటున్నా కూడా రాశి కన్నా నో అంటూ దూరం పెట్టేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news