Movies"అలాంటివాడు ఒక్కడున్నా సరే లైఫ్ జిల్ జిల్ జిగా".. మెగా డాటర్...

“అలాంటివాడు ఒక్కడున్నా సరే లైఫ్ జిల్ జిల్ జిగా”.. మెగా డాటర్ నిహారిక నోట ఊహించని మాట..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మలు అందరూ కూడా నిహారిక కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు . జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని నిహారిక విడాకులు తీసేసుకునింది . విడాకుల తర్వాత జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకెళ్లడానికి ట్రై చేస్తుంది.

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే నిహారిక తాజాగా మాట్లాడిన మాటలు ఇప్పుడు అభిమానులకి షాకింగ్ గా అనిపిస్తున్నాయి . నిహారిక సాగు ప్రెస్మీట్లో పాల్గొని ఎమోషనల్ కామెంట్స్ చేసింది . “సాగు నా మనసుకు బాగా దగ్గరైన సినిమా .. ఎందుకంటే నేను కూడా మీలాగే ఒక స్క్రీనింగ్ అతిథిగా పిలిస్తే వెళ్లాను.. ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయాను ..జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం సర్వసాధారణం “..

“ఎన్ని దెబ్బలు తగిలినా ఏ మాత్రం భయపడకుండా ధైర్యంతో ముందడుగు వేయడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే అది కచ్చితంగా సాధ్యమవుతుంది .. ఏమైనా పర్లేదు చూసుకుంటాం అని చెప్పేవాడు ఒక్కడుంటే చాలు ..మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు చనిపోకుండా ఏదైనా సాధించడానికి ముందడుగు వేయగలం అన్న కాన్ఫిడెన్స్ మనలో వస్తుంది.. నేను బాధలో ఉన్నప్పుడు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నాకు చాలా చాలా అండగా నిలబడ్డారు ..వారికి ధన్యవాదాలు “అంటూ చెప్పుకొచ్చింది. కాగా సాగు సినిమా మార్చి 4న ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో సస్ట్రీమింగ్ కాబోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news