టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్ మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది .. అంటే మాత్రం అది కచ్చితంగా సమంత – నాగచైతన్య విడిపోవడం. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకున్నారు . కేవలం ఈ ఒక్క జంటే కాదు ఇండస్ట్రీలో చాలామంది జంటలు విడాకులు తీసుకున్నారు. కానీ రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ జంటపై అందరూ ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు నిరంతరం ట్రోల్ అవుతూనే ఉంటాయి.
ఆ కారణం చేతనే విడాకులు తీసుకున్నారు అని ..సమంతకు వేరే వాళ్ళతో ఎఫైర్ ఉందని ..నాగచైతన్యకు ఏదో ప్రాబ్లం ఉందని ..అక్కినేని ఫ్యామిలీ సమంతను బాగా టార్చర్ చేసిందని ..ఒకటా రెండా ఎన్నెన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి . రీసెంట్గా సోషల్ మీడియాలో అక్కినేని నాగచైతన్య సమంతలకు సంబంధించిన మరొక మ్యాటర్ బాగా ట్రెండ్ అవుతుంది.
అక్కినేని నాగచైతన్య తో సమంత విడాకులు తీసుకున్న ఇంకా అక్కినేని ఫ్యామిలీ ఇంట్లో సమంత గుర్తు పధిలంగానే ఉంది అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అక్కినేని నాగచైతన్య సమంతతో పెళ్లి చేసుకున్న తర్వాత అక్కినేని కుటుంబం ఫ్యామిలీ ఫోటో తీసుకుంది . ఆ ఫోటో పెద్ద ఫ్రేమ్ చేసి అక్కినేని ఇంటికి ఎంట్రెన్స్ లో ఎప్పటినుంచో అలాగే ఉంచేసారట .
సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఆ ఫోటోని తీసేయొచ్చు .. కానీ అక్కినేని ఫ్యామిలీ ఎందుకో అలా చేయలేదు. ఇప్పటికీ ఎవరైనా అక్కినేని నాగార్జున ఇంటికి వెళ్తే కచ్చితంగా లివింగ్ రూమ్ లో ఆ ఫోటోని చూడాల్సిందే . అయితే సమంతతో విడాకులు తీసుకున్న కూడా ఎందుకు..?? ఆ ఫోటోని తీసేయలేదు అన్నది ప్రశ్నర్ధకంగా మారింది . కొందరు ఇష్టపడి ఫ్యామిలీ అంతా కలిసి తీసుకున్న ఫోటో అంటుంటే .. మరి కొందరు దట్ ఈజ్ అక్కినేని ఫ్యామిలీ అంటూ ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు..!!