Movies"నాకు సిగ్గు లేదు ..అలాంటివి పట్టించుకోను".. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్...

“నాకు సిగ్గు లేదు ..అలాంటివి పట్టించుకోను”.. మిల్కీ బ్యూటీ తమన్నా సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

తమన్నా.. మిల్కీ బ్యూటీగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. క్రేజ్ కూడా దక్కించుకునింది . హ్యాపీడేస్ సినిమాతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్న తమన్నా ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోస్ మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – ప్రభాస్ – చరణ్- తారక్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటించే అవకాశం అందుకుంది. అమ్మడి అదృష్టమో టాలెంటో తెలియదు కానీ ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

దీంతో ఆమె టాప్ హీరోయిన్గా మారిపోయింది . రీసెంట్గా తమన్నా.. బాలీవుడ్ లో ఎలాంటి బోల్డ్ సిరీస్ చేసిందో మనం చూసాం . బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో రెచ్చిపోయి పర్ఫామెన్స్ ఇచ్చింది . అయితే అప్పట్లో ఈ పర్ఫామెన్స్ పై చాలా చాలా ట్రోలింగ్ ఎదుర్కొంది . రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్న వాటిపై క్లారిటీ ఇచ్చింది .

“ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ ..సినీ సెలబ్రిటీల విషయాలలో ప్రతి ఒక్కరు జోక్యం చేసుకుంటారు.. మా జీవితాలను వాళ్లే ఉద్దరిస్తున్నట్లు మాట్లాడేస్తారు ..ట్రోలింగ్ చేసే వాళ్ళకి మా బాధలు తెలియవు ..మా బాధలు పట్టించుకోని వాళ్ల గురించి పట్టించుకునే అంత టైం నాకు లేదు ..ఎవరు ఏమనుకున్నా నాకు సంబంధం లేదు “అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చింది. ప్రజెంట్ తమన్నా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో యమ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news