Moviesఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అల్లు అర్జున్ చేయాల్సిందా..?...

ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అల్లు అర్జున్ చేయాల్సిందా..? చెడగొట్టింది ఎవరు? తెరవనక ఏం జరిగింది..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం .. ఇది ఓ మాయలోకం .. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు అని చాలామంది స్టార్ సెలబ్రిటీస్ చెబుతూ ఉంటారు . అయితే ఆ బాధను అనుభవించిన వాళ్లకు మాత్రమే ఆ నొప్పి తెలుస్తుంది . అలాంటి వాళ్ళల్లో చాలామంది ఉన్నారు . రీసెంట్ గా సోషల్ మీడియాలో ఉదయ్ కిరణ్ – అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .

ఉదయ్ కిరణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ గా మారాడు . అయితే ఎంత త్వరగా స్టార్ గా మారాడో..అంతే త్వరగా పాతాళానికి పడిపోయాడు. అంతేకాదు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు . ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని మరణించిన విషయం అందరికీ తెలిసిందే .

కాగా ఉదయ్ కిరణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “నువ్వు నేను”. నిజానికి డైరెక్టర్ తేజ ఈ కథను అల్లు అర్జున్ తో తెరకెక్కించాలనుకున్నారట . ఇదే విషయాన్ని అల్లు అరవింద్ కు వివరించారట. స్టోరీ చెప్పగా ఈ స్టోరీకి అల్లు అర్జున్ చాలా చిన్న ఏజ్ అవుతుంది అని ..ఇప్పుడు ఇప్పుడే అల్లు అర్జున్ మల్టీమీడియా నేర్చుకుంటున్నాడు అని ..అయినా వాడు ఇలాంటి సినిమాకి సూట్ అవ్వడు అంటూ ఈ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశాడట . ఆ తర్వాత ఈ ప్రాజెక్టులోకి ఉదయ్ కిరణ్ వచ్చాడు. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ ఎంత క్రేజీ గుర్తింపు సంపాదించుకున్నాడో మన అందరికీ తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news