ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికన్నా హాట్ టాపిక్ గా వినిపిస్తున్న హీరోయిన్ పేరు జాన్వి కపూర్ . శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అందాల ముద్దుగుమ్మ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది . ఈ సినిమాపై అభిమానులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ జాన్వి కపూర్ పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది .
బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు పాన్ ఇండియా హీరోల సినిమాలలో అవకాశం దక్కించుకోవడం మామూలు విషయం కాదు . అలాంటి ఓ అరుదైన ఘనతను అందుకున్న జాన్వికపూర్ తలతిక్కలతో ఒక నిర్ణయం తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. బిగ్ ప్రాజెక్ట్ నుంచి జాన్వికపూర్ తప్పకుంది అంటూ సోషల్ మీడియాలో బాగా వార్త ట్రెండ్ అవుతుంది.
ఎన్టీఆర్ -చరణ్ తర్వాత జాన్వి కపూర్ – విజయ్ దేవరకొండ తో సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అంటూ ప్రచారం జరిగింది . విజయ్ తిన్నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయిందట . అయితే మొదటిగా ఫస్ట్ హీరోయిన్ అని చెప్పి ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని మూవ్ చేశారట. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకుందట . సినిమా కోసం ఇచ్చిన రెమ్యూనరేషన్ కూడా వెనక్కి ఇచ్చేసిందట . ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!