కాజల్ అగర్వాల్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . కోలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించింది . తనదైన స్టైల్ లో మెప్పించి అలరించిన కాజల్ అగర్వాల్ .. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లోను దూసుకుపోతుంది కాజల్ అగర్వాల్ . ప్రెసెంట్ పలు సినిమాలలో బిజీబిజీగా ఉంది . కెరియర్ పిక్స్ లో ఉండగానే కాజల్ అగర్వాల్ తన ఫ్రెండ్ గౌతమ్ కిచ్చులును ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఆ తర్వాత నీల్ కిచ్చులుకి జన్మనిచ్చేసింది. బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు అందించి అభిమానుల కళ్ళల్లో ఆనందం నింపింది . అయితే కత్తిలాంటి స్టార్ హీరోస్ ఎంతమంది ఆమెకు ప్రపోజ్ చేసిన రిజెక్ట్ చేసి గౌతమ్ కిచ్చులు నే పెళ్లి చేసుకోవడం వెనక బిగ్ రీజన్ ఉందట . చిన్నప్పటినుంచి ఆమెకు బాగా తెలుసు ..నో బాడ్ హాబిట్స్.. అర్థం చేసుకునే మనస్తత్వం.. పైగా ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఎప్పుడు మాట మారుస్తారో ఎవరికీ తెలియదు .
గతంలో కాజల్ ఓ హీరోని ప్రేమించి మోసపోయింది అన్న వార్తలు కూడా వినిపించాయి . ఈ క్రమంలోనే కాజల్ అన్నీ తెలిసినవాడైతే బెటర్ అంటూ గౌతమ్ ని పెళ్లి చేసుకుందట.
పెళ్లి తర్వాత కాజల్ లైఫ్ ని బిందాస్ గా ముందుకు తీసుకెళ్తుంది. అంతేకాదు ఆమె బిడ్డ పుట్టిన తర్వాత వెంటనే బాడీని షేపుల్లోకి పెట్టేసి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది..!!