ఈ మధ్యకాలంలో హీరోయిన్ సమంత ఏం మాట్లాడిన పెద్దగా రాద్ధాంతం చేయడం భూతద్దంలో పెట్టి చూడడం చాలా చాలా అలవాటుగా మారిపోయింది . మరీ ముఖ్యంగా సమంత విడాకులు తీసుకున్నప్పటినుంచి సోషల్ మీడియాలో ఇలాంటి రకమైన వార్తలు ఎక్కువగా వింటున్నాం. మయోసైటిస్ వ్యాధికి గురైన సమంత తన కష్టంతో తన పట్టుదలతో ఆ వ్యాధి నుంచి ఎట్టకేలకు బయటపడింది . ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది.
పలు సినిమాలు వస్తున్నా సరే మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో సమంత ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకుంది. నా కెరియర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడే విరామం తీసుకున్నాను ..నాకు తెలుసు ఇది నిజంగా పెద్ద సాహసం అనే చెప్పాలి.. కానీ నాకు తప్పలేదు .. తప్పు అని తెలిసినా కూడా తప్పక చేయాల్సిన పరిస్థితి ఎదురైంది.. ఆరోగ్యం కంటే ఏది గొప్పది కాదు కదా ..అదే నేను అనుకున్నాను .. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలి అంటే నా ఈ కఠినమైన నిర్ణయం కంపల్సరీ అనుకున్నాను.. నా అభిమానులకు మాత్రం నేను దూరంగా ఉండలేను ఎప్పటికప్పుడు టచ్ లోనే మీకు ఉంటూ వస్తున్నాను “అంటూ తనదైన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చింది .
సమంత త్వరలోనే మంచి సినిమాలతో మన ముందుకు రాబోతుంది అంటున్నారు అభిమానులు . ప్రజెంట్ సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. సమంత లాస్ట్ గా తెరపై కనిపించింది ఖుషి సినిమాలో . విజయ్ దేవరకొండ తో ఈ సినిమాలో రెచ్చిపోయిన నటించింది. ఆమె నటించిన సిటాడిల్ సిరీస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!