సినిమా ఇండస్ట్రీలో చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. కొందరు ఓపెన్ గానే వాళ్ళ ఫ్రెండ్ షిప్ ను బయటపెడతారు. మరి కొంతమంది సీక్రెట్ గా వాళ్ళ ఫ్రెండ్ షిప్ ను లోపలే దాచుకుంటారు. మన ఫ్రెండ్షిప్ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అనుకునే టైప్ వాళ్ళు ..రీసెంట్గా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ – తారక్ ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కి సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి . అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టైలిష్ స్టార్ గ్లోబల్ వైడ్ గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు .
పుష్ప సినిమాతో ఆల్ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి ఫిక్స్ అయిపోయాడు . తారక్ ఆల్రెడీ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకునేసాడు . వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేయబోతున్నాడు . వీళ్లిద్దరు చాలా చాలా జాన్ జిగిడి దోస్తులు.. అంతకుమించి అనే చెప్పాలి బావా బావా అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . కాగా రీసెంట్గా వీళ్ళకి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది . ఎన్టీఆర్ కి నచ్చిన సినిమానే బన్నీకి కూడా నచ్చిందట .
ముందుగా ఎన్టీఆర్ ఆ సినిమాను ఓకే చేశాడట . అయితే ఆ డైరెక్టర్ తెలియకుండా బన్నీ కూడా కథ చెప్పాడట . బన్నీ కూడా ఆ కథను ఓకే చేశారట . ఇలా ఇద్దరు కూడా ఒకే సినిమాను ఓకే చేయడంతో ఆ డైరెక్టర్ మీ ఇష్టం ఎవరో ఒకరు కమిట్ అయితే .. నేను సినిమా తీస్తాను అంటూ వీళ్ళకే వదిలేసారట. అయితే ఇద్దరు ఆ సినిమాను త్యాగం చేయాలి అని అనుకున్నారు . కానీ ఫైనల్లీ తారక్ పెద్ద మనసుతో ఈ సినిమా నీకే బాగుంటుంది అంటూ బన్నీని బాగా ఫోర్స్ చేసి బలవంతం చేసి ఒప్పించారట. ఆ సినిమా మరేదో కాదు బన్నీ కెరీర్నే మలుపు తిప్పిన “బన్నీ” సినిమా. ఈ టైంలో వాళ్లు కొంచెం సరదాగా గొడవ కూడా పడ్డారట..!!