Moviesమెగాస్టార్ పెట్టుకున్న ఈ వాచ్ కాస్ట్ ఎన్ని కోట్లో తెలుసా..? అంత...

మెగాస్టార్ పెట్టుకున్న ఈ వాచ్ కాస్ట్ ఎన్ని కోట్లో తెలుసా..? అంత స్పెషాలిటీ ఏంటంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన విషయాలు నెట్టింట ఎలా ట్రెండ్ అవుతున్నాయో … వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాప్ సెలబ్రిటీస్ ధరించే షర్ట్స్ పెట్టుకునే యాక్ససరీస్ కి సంబంధించిన విషయాలు బాగానే వైరల్ గా మారాయి . రీసెంట్గా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి చేతికి ధరించిన వాచ్ హైలెట్గా మారింది. చూడడానికి చాలా సింపుల్ గానే ఉన్న దాని ఫీచర్స్ దాని కాస్ట్ తెలుసుకొని షాక్ అయిపోతున్నారు .

తాజాగా హైదరాబాదులో సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ వేడుక ఘనంగా అంగరంగ వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . ఈ క్రమంలోనే చిరు పెట్టుకొచ్చిన వాచ్ అందరి దృష్టిని అట్రాక్ట్ చేసింది . చాలా స్టైలిష్ గా మోడ్రన్ గా ట్రెండీగా సింపుల్ లుక్స్ లో ఉండడం అందరికి నచ్చేసింది.

అయితే ఆ వాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు మెగా అభిమానులు. అందుతున్న సమాచారం ప్రకారం.. కాస్మోగ్రాఫ్ డెకోనా ఐ ఆఫ్ ది టైగర్ అనే పేరుతో పిలవబడే ఈ వాచ్ చాలా చాలా స్పెషల్ . మామూలు వాచ్ కన్నా ఫీచర్స్ ఎక్కువగా ఉంటాయి . చాలా స్టైలిష్.. ప్రతి మెటీరియల్ కూడా చాలా కాస్ట్లీ గా డిజైన్ చేయబడింది. ఈ వాచ్ ద్వారా దాదాపు 1.90 కోట్లకు పైగానే ఉంటుంది అంటూ మార్కెట్లో టాక్ వినిపిస్తుంది . ఈ వాచ్ ధర తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు . మెగాస్టార్ రేంజ్కి ఇది ఓకే అయినా కూడా సామాన్యులు వచ్చి కొనాలి అంటే కిడ్నీలు అమ్ముకున్న కూడా సరిపోదు అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news