సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే అందరికీ రొమాంటిక్ కపుల్ అనగానే గుర్తొచ్చేది అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో మనకు తెలిసిందే. చాలా చక్కగా బిహేవ్ చేస్తుంది. అంతేకాదు వీళ్ళను చూసే పెళ్లి చేసుకోవాలి అనుకున్న స్టార్ జంటలు కూడా ఎంతోమంది ఉన్నారు . అల్లు అర్జున్ స్నేహల లవ్ స్టోరీ గురించి అందరికీ తెలిసిందే .
అది ఓ తెరిచిన పుస్తకం . ఓ పబ్ లో అల్లు అర్జున్ స్నేహారెడ్డిని చూశాడు .. చూసి చూడగానే లవ్ చేసేసాడు.. ఆమెకు ఐ లవ్ యు చెప్పి ప్రపోజ్ చేశాడు ..అయితే స్నేహ రెడ్డి మాత్రం అల్లు అర్జున్ ని ఫస్ట్ చూపులోనే ఇష్టపడింది. ఆయనకు మాత్రం ఓకే చెప్పలేదట . అంతేకాదు అల్లు అర్జున్ ని నెలరోజుల పాటు బాగా స్టడీ చేసిందట . బ్యాక్ గ్రౌండ్ డీటెయిల్స్ క్యారెక్టర్ గురించి బాగా ఎంక్వయిరీ చేసిందట .
ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అమ్మాయిలతో సరదాగా మాట్లాడుతాడు అని.. అల్లరి చిల్లరిగా కౌంటర్స్ వేస్తూ ఉంటాడు అని తెలుసుకొని అలాంటి పద్ధతులు తనకు నచ్చవు అని చెప్పి పెళ్లి తర్వాత అలా అమ్మాయిలని ఏడిపించడం ఆట పట్టించడం లాంటివి చేయకూడదు అంటూ కండిషన్ పెట్టిందట . బన్నీ కూడా స్నేహారెడ్డి పై ఉన్న ప్రేమతో కండిషన్ను ఓకే చేశాడట. ఆ తర్వాతే బన్నీ – స్నేహ రెడ్డిల వివాహం జరిగింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అంతే కాదు ఈ సినిమా అయిపోయిన తర్వాత మరి కొంతమంది స్టార్ డైరెక్టర్ ల తో మూవీకి కమిట్ అయ్యాడు బన్నీ..!!