సినిమా ఇండస్ట్రీలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన కెరియర్ ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. అది ఎంతటి పెద్ద స్టార్ హీరో అయినా హీరోయిన్ అయినా సరే .. అందుకే ఇండస్ట్రీలోని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆచితూచి ఆలోచించి తీసుకోవాలి అంటూ.. రీసెంట్గా సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జునకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది .
అక్కినేని నాగార్జున తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు .. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . అయితే ఫ్లాప్ అయినా ఏ సినిమాకి కూడా నాగార్జున బాధపడలేదు ..ఏడవలేదు ఒకే ఒక్క సినిమా విషయంలో మాత్రం బాగా బాధపడ్డాడట. నాగార్జున కెరీర్లో బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా మన్మధుడు . ఈ సినిమాకి సీక్వెల్ కూడా వచ్చింది.
అయితే మన్మధుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మన్మధుడు 2 మాత్రం అంత డిజాస్టర్ గా మారింది . ఈ సినిమా పరమ చెత్త టాక్ అందుకునింది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో లిప్ లాక్ లో నటించాడు నాగార్జున. దీనిపై అప్పట్లో హ్యూజ్ ట్రోలింగ్ కూడా జరిగింది . అంతేకాదు ఈ సినిమాలో నటించినందుకు గాను ఆ తర్వాత బాగా బాధపడ్డాడట నాగార్జున . ఎందుకు ఇలాంటి తప్పు చేశాను ఇలాంటి సినిమాలో నటించాను అంటూ చాలా చాలా ఏడ్చాడట . అప్పట్లో ఈ వార్త వైరల్ గా మారింది. రీసెంట్ గానే నా స్వామి రంగా సినిమాతో హిట్టు అందుకున్నాడు నాగార్జున..!!