Moviesనాగచైతన్య దశతిరిగిపోయే ఛాన్స్.. ఎవ్వడు అడ్డు వచ్చినా హిట్ ఆపలేని ఆఫర్...

నాగచైతన్య దశతిరిగిపోయే ఛాన్స్.. ఎవ్వడు అడ్డు వచ్చినా హిట్ ఆపలేని ఆఫర్ కొట్టేసాడుగా..!!

నాగచైతన్య .. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా అక్కినేని నాగార్జున గారి కొడుకుగా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ స్థానాన్ని అందుకున్నాడు . సోషల్ మీడియాలో నాగచైతన్య గురించి ఈ మధ్యకాలంలో ఎలాంటి వార్తలు వింటున్నామో కూడా మనకు తెలిసిందే. అక్కినేని నాగచైతన్య ప్రజెంట్ చందు ముండేటి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . తండేల్ అంటూ ఈ సినిమాకి నామకరణం కూడా చేశారు .

ఈ సినిమా ప్రెసెంట్ సెట్స్ పై ఉంది . సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది . అంతేకాదు ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది . కాగా ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నాగచైతన్య మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఒక్క ఆఫర్ తో నాగచైతన్య దశ తిరిగిపోయినట్లే అంటున్నారు. ఈ సినిమాని సుకుమార్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు ఓ న్యూస్ కూడా బాగా వైరల్ గా మారింది.

విరుపాక్ష సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన కార్తీక్ దర్శకత్వంలో నాగచైతన్య ఒక సినిమాను ఫిక్స్ అయ్యాడట . ఈ సినిమా పూర్తిగా హారర్ జోనర్లో తెరికెక్కబోతుందట. నాగచైతన్య హారర్ జోనర్ ను టచ్ చేయడం చాలా చాలా రేర్. దూత వెబ్ సిరీస్ మాత్రమే ఆ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది . అయితే ఇది మాత్రం పూర్తిగా క్షుద్ర పూజలు చేతబడులు నేపథ్యంలో తెరకెక్కబోతుందట . దీంతో నాగచైతన్య సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు జనాలు . కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news