టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఆయన నటిస్తే చాలు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తూ ఉంటారు . అలాంటి ఒక స్పెషల్ గుర్తింపు సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు . కానీ కొన్ని కొన్ని సినిమాలు ఆయన ఫ్యాన్స్ కి చాలా చాలా బాగా నచ్చుతూ ఉంటాయి.
వాటిల్లో ఒకటే “గ్యాంగ్ లీడర్”. ఈ సినిమాలో చిరంజీవి నటించిన తీరు చేసిన పర్ఫామెన్స్.. డాన్స్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు ఏమో.. అంత బాగా ప్రాణం పెట్టి నటించాడు. నిజానికి ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు చిరంజీవి ఈ సినిమాను రిజెక్ట్ చేశారట . ఈ సినిమా కన్నా ముందే గ్యాంగ్ లీడర్ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ విజయ బాపినీడు పట్నం వచ్చిన ప్రతివతలు – హీరో – మగధీరుడు వంటి కొన్ని చిత్రాలకు డైరెక్షన్ వహించారు.
సరికొత్తకధతో చిరంజీవికి మంచి విజయం అందించాలి అని ఈ నిర్ణయం తీసుకున్నారట విజయ బాపినీడు . చాలా కష్టం మీద కథను సిద్ధం చేసుకుని ఆయనకు వినిపించాడట . అయితే ఎటువంటి మొహమాటం లేకుండా స్టోరీ విన్నాక నేను చెయ్యను సినిమా ఆడదు అంటూ చెప్పేశాడట చిరంజీవి . అప్పుడు విజయ బాపినీడు బాగా హర్ట్ అయ్యారట. సరాసరి పరుచూరి బ్రదర్స్ వద్దకు వెళ్లి కధను వినిపించాడట . ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేశాక చిరంజీవి ఆ సినిమాను ఓకే చేశారట .
ఆ సినిమా ఆయన కెరియర్ ని మలుపు తెప్పింది . ఈ సినిమా చిరంజీవికి ఊహించిన విజయాన్ని అందించింది . అలా చిరంజీవి ఒక కథ విని ఆ కథ హిట్ అవుతుందా..? ఫ్లాప్ అవుతుందా..? అని ముందే చెప్పగలడు . తాను వద్దు అనుకున్న కథను తనకి ఇష్టం వచ్చిన విధంగా మార్చుకొని నటించి అభిమానుల్ని మెప్పించే సత్తా ఉన్నవాడు చిరంజీవి . అందుకే మెగాస్టార్ అయ్యాడు ..పద్మ భూషణ్ – పద్మ విభూషణ్ లాంటి అవార్డులు అందుకోగలిగాడు..!!