Movies"ఓరేయ్..వద్దు ఆ సినిమా చేయకు రా".. అల్లు రామలింగయ్య నెత్తి నోరు...

“ఓరేయ్..వద్దు ఆ సినిమా చేయకు రా”.. అల్లు రామలింగయ్య నెత్తి నోరు మొత్తుకున్న చిరజీవి చేసిన మూవీ ఇదే..!!

చాలామంది అనుకుంటూ ఉంటారు.. మెగాస్టార్ చిరంజీవికి అస్సలు కోపం రాదు అని .. పెద్దలు చెప్పిన మాటలను చాలా చక్కగా వింటూ ఉంటాడు అని.. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు అని .. ఇప్పటికీ చాలామంది మెగా ఫ్యాన్స్ పలు సందర్భాలలో గుర్తు చేసుకుంటూ ఉంటారు . కానీ అది తప్పు అని చెప్పడానికి ఒక ఇన్సిడెంట్ బయటపడింది . ఎస్ మెగాస్టార్ చిరంజీవి కూడా మొండివాడు .. తాను అనుకున్న పని చేసి తీరుతాడు.. కొన్నిసార్లు ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిసిన సరే ఇష్టంగా ఆ సినిమాలో నటిస్తాడు.. అలా చేసిన సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవికి అల్లు రామలింగయ్య మామయ్య అవుతారు . అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లి చేసుకున్నాడు చిరంజీవి. చిరంజీవి సినిమాల విషయంలో అల్లు రామలింగయ్య కీలకపాత్ర పోషించారు అని చెప్పడంలో సందేహం లేదు . అయితే అన్ని సినిమాల విషయంలో మామ చెప్పిన మాటలను చాలా జాగ్రత్తగా పట్టించుకున్న చిరంజీవి ఒక్క సినిమా విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేశాడు . అదే ఆయన కొంప ముంచేసింది . ఆ సినిమా మరేదో కాదు “బిగ్ బాస్”.

విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మెగాస్టార్ కి అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేక పోయింది . ఈ సినిమా స్టోరీ విన్న చిరంజీవి ఆ స్టోరీను అల్లు రామలింగయ్య గారితో డిస్కస్ చేశారట. అయితే అల్లు రామలింగయ్య గారు ఆ కథలో పెద్దగా స్పార్క్ లేదు అని చేయకపోతేనే బెటర్ అంటూ సజెస్ట్ చేసారట . కానీ చిరంజీవి వినలేదు కొన్ని మార్పులు చేర్పులు చేయించి ఆ సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమా అభిమానులు అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా చిరంజీవి అభిమానులు సైతం డిసప్పాయింట్ చేసింది . అలా అల్లు రామలింగయ్య గారి మాటలు కాదని తన కెరియర్లో ఒక బిగ్ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు చిరంజీవి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news