Moviesవాలెంటైన్స్ డే స్పెషల్ : ప్రేమ విషయాన్ని బయట పెట్టేసిన రష్మిక...

వాలెంటైన్స్ డే స్పెషల్ : ప్రేమ విషయాన్ని బయట పెట్టేసిన రష్మిక మందన్నా.. ట్వీట్ వైరల్..!!

రష్మిక మందన్నా సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే హాట్ హీరోయిన్. నేషనల్ క్రష్ గా భారీ స్థాయిలో ట్యాగ్స్ చేయించుకున్న సరే .. తనకి కొంచెం టైం దొరికిన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది . అభిమానులు ఆటోగ్రాఫ్లు.. ఫోటోగ్రాఫ్లు .. సెల్ఫీలు అంటూ ఎగబడినా సరే.. ఏ మాత్రం విసుక్కోకుండా ఓపికగా సమాధానం చెబుతూ సెల్ఫీలు ఇచ్చే రష్మిక మందన్నా.. వాలెంటైన్స్ డే కు కొద్ది గంటల ముందు పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

రష్మిక మందన్నా తన ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ చేసింది . ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానులకు కొత్త డౌట్లు పుట్టిస్తుంది . రష్మిక ట్విట్ చేస్తూ..” మీతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది .. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ..ఈరోజు అన్ని మాట్లాడేసుకుందాం.. చెప్పండి ఇప్పటివరకు జరిగిన ప్రతి విషయం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను .. ఈ వాలెంటైన్స్ డే ప్లాన్స్ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను”.. దానికి తగ్గట్టే రెండు క్యూట్ సెల్ఫీలను కూడా షేర్ చేసింది .

దీనితో రష్మిక ట్వీట్ కి అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. నువ్వు ఈ ట్వీట్ మాకోసం పెట్టావా ..? లేక ఇంకెవరి కోసమైనా పెట్టావా ..? అంటూ పరోక్షంగా విజయ్ దేవరకొండ పేరుని ప్రస్తావిస్తూ ట్రెండ్ చేస్తున్నారు . గత కొంతకాలంగా రష్మిక – విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . త్వరలోనే నిశ్చితార్ధం చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వైరల్ అయ్యాయి . అయితే అలాంటిది ఏదీ లేదు అంటూ ఈ జంట కొట్టిపడేసింది . వాలెంటైన్స్ డే కి కొన్ని గంటల ముందు రష్మిక పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news