ఉదయ్ కిరణ్.. ఈ పేరు చెప్తే కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు వచ్చేస్తాయి . అంతలా ఆయన మరణం అభిమానులను బాధపెడుతుంది . చనిపోయి చాలా సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఆయన మరణాన్ని గుర్తుచేసుకొని అభిమానులు బాధపడుతున్నారు అంటే ఆయనపై ఉన్న ప్రేమ అభిమానాలు గౌరవమే అని చెప్పాలి. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ సెలబ్రిటీగా మారిపోయిన ఉదయ్ కిరణ్ ఎంత త్వరగా ఇండస్ట్రీలోకి వచ్చాడో.. అంతే త్వరగా పాతాళానికి పడిపోయాడు . అప్పట్లో ఆయన నటించిన సినిమాలు చూడడానికి కాలేజీ అమ్మాయిలు కాలేజీకి డుమ్మా కొట్టి మరి సినిమా థియేటర్స్ కి వెళ్లేవాళ్లు .
అంతలా ఆయన ఇష్టపడేవారు . మన ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల కూతుర్లు కూడా ఉదయ్ కిరణ్ ను బాగా లైక్ చేశారు . అయితే ఉదయ్ కిరణ్ కొన్ని ఫైనాన్షియల్ ఇబ్బందులు కారణంగా సూసైడ్ చేసుకున్నాడు అని వార్తలు వినిపించాయి. ఒకవేళ నిజంగా ఉదయ్ కిరణ్ తన లైఫ్ లో ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు మహేష్ బాబు , ప్రభాస్ లాంటి స్టార్ హీరో అయ్యుండేవాడు అంటున్నారు అభిమానులు .
ఉదయ్ కిరణ్ అందర్నీ గుడ్డిగా నమ్మేశాడు. ఆ కారణంగానే ఆయన పారితోషకం కమిట్ అవ్వకుండానే కొన్ని సినిమాలకు సైన్ చేసి ఫ్రీగా చేసి పెట్టారు . ఆ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఒక్క రూపాయి కూడా నిర్మాతలు ఆయనకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదు . అంతేకాదు ఉదయ్ కిరణ్ మంచితనమే ఆయనను నిండా ముంచేసింది అంటూ అప్పట్లో అభిమానులు బాగా బాధపడ్డారు . మొత్తానికి తెలిసి చేశాడో తెలియక చేసాడో తెలియదు కానీ చిన్న తప్పుడు నిర్ణయం కారణంగా ఉదయ్ కిరణ్ బంగారం లాంటి భవిష్యత్తును పాడు చేసుకున్నాడు..!!