తెలుగు హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న భానుప్రియ వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె తెలుగుతో పాటు కన్నడ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుంది. అయితే.. అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నా.. త్వరగానే సినిమా రంగం నుంచి తప్పుకొంది. సుమారు 120 సినిమాల్లో నటించిన భానుప్రియ.. ఇటీవల కాలంలో అప్పుడప్పుడు క్యారెక్టర్ పాత్రలు వేస్తూ.. కనిపిస్తున్న విషయం తెలిసిందే.
భానుప్రియ స్వస్థలం.. రాజమండ్రి అంటే.. చాలా మంది ఆశ్చర్యపోతారు. 1980లలో దర్శకుడు వంశీ సితార సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. ఈయన అనేక మందిని పరిశీలించారు. కానీ, ఆ కథకు తగిన హీరోయిన్ లభించలేదు. ముందుజయప్రదను అనుకున్నారట. కానీ, వయసు ఎక్కువగా ఉండడంతో కాదని అనుకుని.. హీరోయిన్ల వేట ప్రారంభించారు. ఈ సమయంలోనే రాళ్లపల్లి సలహాతో రాజమండ్రిలో ఉన్న భానుప్రియను పిలిచి స్క్రీన్ టెస్టులు చేశారు.
తొలి ప్రయత్నంలోనే వంశీకి ఎంతో నచ్చేసింది. దీంతో సితార సినిమాతో ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేశారు. ఈ సినిమాలో కథ అంతా కూడా హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. పాటలు హైలెట్. సినిమా సూపర్ హిట్. తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 1980-1993 మధ్యకాలంలో ఆమె అనేక తెలుగు, తమిళ చిత్రాలలో హీరోయిన్‌గా నటించింది.
1990లలో కొన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన భానుప్రియ…. సోదరి నిషాంతి కూడా శాంతిప్రియ అన్న పేరుతో తెలుగు తెరకు పరిచయమయ్యేలా చేసింది. తర్వాత వంశీ తీసిన మహర్షి సినిమాలో ఈమే హీరోయిన్‌గా నటించింది. భానుప్రియ ప్రస్తుతం అమెరికాలో ఉంటూ, దక్షిణ భారతదేశ శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి,, భరతనాట్యంలో శిక్షణ ఇస్తూ.. ఇనిస్టిట్యూట్ నడుపుతుండడం విశేషం.