ఈ మధ్యకాలంలో ఎలాంటి ఫొటోస్ నైనా సరే సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం బాగా అలవాటుగా మారిపోయింది. కొంతమంది ప్రేమ – పెళ్లి- ప్రెగ్నెన్సీ విషయాలకు సంబంధించిన ఫోటోషూట్స్ షేర్ చేసుకుంటే మరి కొంతమంది ఏకంగా హనీమూన్ పిక్చర్స్ కూడా షేర్ చేసుకుంటూ వస్తున్నారు . అయితే రీసెంట్గా బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ కుమార్ ఐరా ఖాన్ ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .
తండ్రికి మించిన స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఐరా ఖాన్ సోషల్ మీడియాలో ఎప్పుడు రచ్చ రంబోలా చేస్తూనే ఉంటుంది . హాట్ హాట్ డ్రస్సులతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. ఆమె నుపూర్ శిఖరే తో ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి . ఆ తర్వాత ఆ వార్తలను నిజం చేసింది ఐరా ఖాన్ . కొన్నాళ్లపాటు లవ్ లో మునిగితేలిన వీళ్ళు ఇటీవలే తమ పెళ్ళి గ్రాండ్గా చేసుకున్నారు . దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి . కాగా ఈ జంట హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్లారు .
అక్కడ ఐరా-నూపూర్ బాగా ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు . అయితే జనాలకి ఒక బిగ్ డౌట్ వచ్చింది . వీళ్ళు వెళ్ళింది హనీమూన్ కోసమా..? ఒలంపిక్స్ ట్రైనింగ్ కోసమా..? అంటూ వెంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు. ” మీ హనీమూన్ ఎలా ఉంది..?” అని భర్తను అడుగుతూ ఐరా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కు పలువురు జనాలు ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు. వెళ్లిన పని కానివ్వకుండా..? ఈ యోగాసనాలు ఏంట్రా బాబు..? అంటుంటే మరికొందరు “నీ కన్నా ఒలంపిక్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు .. ఫిట్నెస్ పైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు” అంటూ చీప్ గా కామెంట్స్ చేస్తున్నారు..!!